సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్ట్ 9 గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. అతడు రీ రిలీజ్ ని అదే డేట్ కి ఫిక్స్ చేసుకోవడంతో ఖలేజా, పోకిరి రికార్డులు బద్దలు కావొచ్చనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. బిజినెస్ పరంగా మంచి క్రేజ్ వచ్చింది. కనీసం వారం పది రోజులు సాలిడ్ రన్ దక్కుతుందనే కాన్ఫిడెన్స్ తో బయ్యర్లు పెద్ద రేట్లే ఆఫర్ చేశారట. అయితే అనౌన్స్ చేసిన నాటికి ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఎవరూ బ్రేక్ చేయలేని మైలురాళ్ళు అతడు నమోదు చేస్తుందనుకుంటే ఇప్పుడు రకరకాల కారణాలు అడ్డుపడేలా ఉన్నాయి. అవేంటో చూద్దాం.
జూలై 24 విడుదల కాబోతున్న హరిహర వీరమల్లుకు మెయిన్ సెంటర్స్ లో కనిష్టంగా మూడు వారాలకు సరిపడా థియేటర్ అగ్రిమెంట్లు జరుగుతున్నాయట. జూలై 31 రిలీజ్ కానున్న కింగ్డమ్ కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తోంది. అంటే ఆగస్ట్ 13 దాకా సాలిడ్ స్క్రీన్లను దాని కోసం హోల్డ్ చేస్తారు. ఇవి కాకుండా అజయ్ దేవగన్ సన్నాఫ్ సర్దార్ 2, జాన్వీ కపూర్ పరం సుందరిలు జూలై 25నే వస్తున్నాయి. వీటి ప్రభావం ఏపీ, తెలంగాణ కాదు కానీ ఇతర రాష్ట్రాలు, ఓవర్ సీస్ లో ఉంటుంది. సో అతడు యునానిమస్ గా అన్ని చోట్ల చెప్పుకోదగ్గ కౌంట్ లో థియేటర్లు దక్కించుకుంటేనే రికార్డులు సాధ్యమవుతాయి.
మరి ఇంతటి కాంపిటీషన్ మధ్య ఆలా సాధ్యమా అంటే ఏమో చెప్పలేం. హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్ మాత్రం ఇవన్నీ చూస్తూ భారీ లాభాలు వస్తాయా లేదా అనే అనుమానంతో కొంత ఆందోళన పడుతున్నారని ట్రేడ్ టాక్. మాములుగా రీ రిలీజులకు మీడియం బడ్జెట్ సినిమాలు పోటీకి వస్తే పెద్ద ఇబ్బంది లేదు. కానీ విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ లేకుండా పోదు. పైగా ఆగస్ట్ 14 ఒకేరోజు వార్ 2, కూలి దిగుతాయి. సో అప్పటికంతా అతడు సెలవు తీసుకోక తప్పదు. ఖలేజాకి ఈ సమస్య రాలేదు. వీక్ అపోజిషన్ తో భారీ కలెక్షన్లు లాగేసింది. మరి అతడు ఏం చేస్తాడో చూడాలి.
This post was last modified on July 9, 2025 4:09 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…