కింగ్ డమ్ విడుదల జూలై 31 ఫిక్సయిపోయింది. నిన్న కొత్త టీజర్ తో అనౌన్స్ మెంట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అలెర్టయిపోయారు. హరిహర వీరమల్లుకి కేవలం వారం గ్యాప్ తో రిలీజ్ చేయాల్సి వస్తున్నా తప్పని సరి పరిస్థితుల్లో ఇంత కన్నా వేరే ఆప్షన్ లేకపోయింది. ఇప్పటికే మార్చి నుంచి మూడు డేట్లు మార్చుకున్న ఈ పీరియాడిక్ డ్రామా మీద నిర్మాణ సంస్థ సితార భారీగా ఖర్చు పెట్టింది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మరో ఆకర్షణగా నిలుస్తోంది. కింగ్ డమ్ ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో విజయ్ మినీ బాంబులు పేలుస్తున్నాడు.
ఒక స్క్రిప్ట్ ని తిరస్కరించే స్వతంత్రం తనకు ఒకప్పుడు లేదని, బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టి ధైర్యంగా ఆ విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పలేకపోవడం ఒక రకంగా మైనస్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. బలమైన నేపథ్యం ఉన్న ఫ్యామిలి, తండ్రి ఉంటే ఒకటికి రెండుసార్లు దాన్ని సరి చూసుకుని అవసరమైతే వేరే రచయితలను తీసుకొచ్చి మార్పులు చేయించే స్టార్ తండ్రులున్న హీరోలు తనకు తెలుసని, ఆ అడ్వాంటేజ్ తనకు లేదని అన్నాడు. ఇప్పుడిప్పుడే స్వంతంగా చెప్పగలిగే స్థాయికి వచ్చానని చెబుతున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు కథ నచ్చకపోతే నిర్మొహమాటంగా నో అనేస్తున్నానని వివరించాడు.
ఇదంతా బాగానే ఉంది కానీ విజయ్ దేవరకొండ నెపోటిజం గురించే ఉదాహరించాడని వేరే చెప్పనక్కర్లేదు. పేరు ప్రస్తావించలేదు కానీ చాలా మందికి అప్లై అవుతుంది. గతంలో లైగర్ ఈవెంట్ లో తనకు తాతలు తండ్రులు లేరని, అయినా ఇంత ప్రేమ చూపించడం ఏమిటని ఫ్యాన్స్ ని ఉద్దేశించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో మిస్ ఫైర్ అయ్యాయి. తర్వాత మళ్ళీ అలా స్లిప్ కాలేదు. ఇప్పుడు అన్నవి అంత తీవ్రంగా లేకపోయినా సబ్జెక్టు సెలక్షన్ కు, వారసత్వ హీరోలకు ముడిపెట్టిన వైనం గురించి మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా కింగ్ డం మాత్రం తనకు చాలా ప్రతిష్టాత్మకం కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates