జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఫార్టీస్‌లోకి రాలేదు. ఇంతలోనే అతను హీరోగా 20 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. టీనేజీలోనే ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా మారిన తారక్.. రెండో సినిమా ‘స్టూడెంట్ నంబర్ వన్’తో మంచి విజయాన్నందుకుని హీరోగా నిలబడ్డాడు. ఆ తర్వాత ‘ఆది’ సినిమా అతణ్ని పెద్ద స్టార్‌ను చేసింది. ‘సింహాద్రి’ ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయి తారక్‌ను సూపర్ స్టార్‌ను చేసింది.
ఆ తర్వాత తారక్ కెరీర్ ఒడుదొడుకులతో సాగినప్పటికీ.. అతడి స్థాయి మాత్రం పడిపోలేదు. టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు తారక్. కొన్నేళ్ల పాటు స్లంప్‌లో సాగిన అతడి కెరీర్.. ‘టెంపర్’ నుంచి మళ్లీ ఊపందుకుంది. అప్పట్నుంచి వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రంలో నటిస్తున్నాడు.
ఎన్టీఆర్ 20 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర కామన్ డిస్‌ప్లే పిక్చర్ తయారు చేశారు. అది టాలీవుడ్లో ఇప్పటిదాకా వచ్చిన సీడీపీల్లో ది బెస్ట్ అంటే అతిశయోక్తి కాదు. మధ్యలో ‘ఆర్ఆర్ఆర్’ నుంచి తారక్ లుక్‌కు తోడు.. ఇప్పటిదాకా అతడి సినిమాలన్నింటి నుంచి లుక్స్ డిస్‌ప్లే చేశారు. చుట్టూ తారక్ సినిమాలను ప్రతిబింబించే సింబల్స్ పెట్టారు.
తొలి సినిమా ‘నిన్ను చూడాలని’ని తలపించేలా రోజా పువ్వు, రెండో సినిమా ‘స్టూడెంట్ నంబర్ వన్’ను గుర్తు చేసేలా లా పుస్తకం.. ‘సింహాద్రి’కి ప్రతిబింబంగా గొడ్డలి.. ఇలా ఒక్కో సినిమాకు ఒక్కో సింబల్ పెట్టారు. మొత్తంగా 20 ఏళ్ల తారక్ ఘన ప్రస్థానానికి గుర్తుగా చాలా ఘనంగానే ఈ సీడీపీ తయారు చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుంచుకునేలా, దాచుకునేలా ఉన్న ఈ సీడీపీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది సోషల్ మీడియాలో.
This post was last modified on November 16, 2020 3:55 pm
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…