సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీర రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటిదాకా సజావుగా సాగింది. త్వరలోనే ఫారెస్ట్ షెడ్యూల్ కోసం కెన్యా వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఆ దేశంలో ఏర్పడిన అనూహ్య పరిస్థితులు ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ గా మారాయి. ప్రెసిడెంట్ మీద అవిశ్వాసంతో పాటు తీవ్ర హింస అక్కడ రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా దొమ్మీలు, గొడవలు, దొంగతనాలు, గ్యాంగ్ వార్ లు ఎక్కువయ్యాయి. ఇలాంటి సున్నితమైన వాతావరణంలో జక్కన్న బృందం అడుగు పెట్టే సిచువేషన్ లేదు. కొంత కాలమయ్యాక సద్దుమణుగుతుంది కానీ అప్పటిదాకా వెయిట్ చేయాలి.
దీనికి ప్రత్యాన్మయం ఆలోచించే పనిలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. పోనీ ఇక్కడ గ్రీన్ మ్యాట్ వేసి పని కానిద్దామంటే అడవి బ్యాక్ డ్రాప్ కాబట్టి అంత సహజత్వం రాదు. జంతువులను విఎఫ్ఎక్స్ లో మ్యానేజ్ చేయొచ్చు కానీ కెన్యాలో ఉండే ఫారెస్ట్ బ్యూటీని ఆర్టిఫీషియల్ గా పునః సృష్టించడం అంత సులభం కాదు. పైగా కాశి ఎపిసోడ్ కోసం వేసిన సెట్ కే ఖర్చు తడిసి మోపెడయ్యిందట. వెయ్యి కోట్ల బడ్జెట్ గా చెప్పబడుతున్న ఈ విజువల్ గ్రాండియర్ కు ఆర్థికంగా ఎలాంటి సమస్య లేదు. అంతర్జాతీయ సంస్థలు ఫండింగ్ కోసం రెడీగా ఉన్నాయి. కాకపోతే రాజమౌళి ఊరికే తొందరపడి ఖర్చు పెట్టించే రకం కాదు.
దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకొన్ని రోజుల్లో రావొచ్చు. 2027 మార్చ్ విడుదలను టార్గెట్ గా పెట్టుకున్న రాజమౌళి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా అనుకున్న టైం ప్రకారమే షెడ్యూల్స్ పూర్తి చేయాలి. ఎక్కడ గ్యాప్ వచ్చినా వాయిదాల గోల మొదలవుతుంది. ఆర్ఆర్ఆర్ కు కరోనాతో పాటు ఇతరత్రా కారణాలు అడ్డు తగిలాయి. మహేష్ 29కి అలాంటి సమస్య రాదనుకుంటున్న టైంలో ఇప్పుడీ కెన్యా ట్విస్టు వచ్చింది. చూడాలి ఎలా పరిష్కారించుకుంటారో. ప్రియాంకా చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోహిస్తున్న ఈ ప్యాన్ వరల్డ్ మూవీకి కీరవాణి ప్రత్యేక తరహా సంగీతాన్ని సృష్టించబోతున్నారట.
This post was last modified on July 7, 2025 3:03 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…