బడ్జెట్లు, వసూళ్ల విషయంలో ఒకప్పుడు బాలీవుడ్ ఎంతో ఎత్తులో ఉండేది. దక్షిణాది చిత్రాలు హిందీ సినిమాలకు దరిదాపుల్లో ఉండేవి కావు. కానీ ‘బాహుబలి’ తర్వాత అంతా మారిపోయింది. సౌత్ సినిమాలు, ముఖ్యంగా తెలుగు చిత్రాల బడ్జెట్లు, కలెక్షన్లు ఎక్కడికో వెళ్లిపోయాయి. రికార్డులన్నీ మన సినిమాల సొంతం అయ్యాయి. బాలీవుడ్ బాగా వెనుకబడిపోయింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ మళ్లీ తన పవర్ చూపించడానికి సిద్ధమవుతోంది. ‘రామాయణం’ సినిమా మొత్తం లెక్కలన్నీ సవరిస్తామని బాలీవుడ్ ధీమాతో ఉంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా షో రీల్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంతో ఇండియన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కొత్త ఒరవడి సృష్టించగలమని మేకర్స్ ధీమాగా ఉన్నారు.
అకాడమీ అవార్డ్ విన్నింగ్ వీఎఫెక్స్ స్టూడియోను ఈ సినిమా కోసం హైర్ చేసుకున్న టీం.. మొత్తం సినిమా మీద అసాధారణ స్థాయిలో బడ్జెట్ పెడుతోందట. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ‘రామాయణం’ మీద మొత్తంగా రూ.1600 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేస్తోంది. వచ్చే ఏడాది దీపావళికి రాబోతున్న ‘రామాయణం’ పార్ట్-1 మీదే రూ.900 కోట్లు ఖర్చు చేస్తున్నారట. రెండో భాగానికి రూ.700 కోట్లు అవుతుందట. కొన్నేళ్ల పాటు జరిగిన ప్రి ప్రొడక్షన్ పనులకు తోడు భారీ సెట్టింగ్స్ వేయడం వల్ల ‘పార్ట్-1’కు ఎక్కువ బడ్జెట్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సెట్స్‌లో కొన్ని రెండో భాగానికి వాడుకోబోతుండడం, కొత్తగా ప్రి ప్రొడక్షన్ పనులు లేకపోవడం వల్ల పార్ట్-2 బడ్జెట్ రూ.200 కోట్లు తగ్గనుంది. ఈ స్థాయిలో ఖర్చు చేసి రికవర్ చేయగలరా అన్న సందేహాలు కలుగుతున్నాయి కానీ.. ‘రామాయణం’ కథకు ఉన్న పొటెన్షియాలిటీ, తమ మేకింగ్ మీద కాన్ఫిడెన్స్‌తో భారీగా లాభాలు కూడా అందుకోగలమని టీం ధీమాగా ఉంది. ఇటీవలి షో రీల్ చూస్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేలాగే ఉంది. ఇందులో రణబీర్ రాముడి పాత్ర చేయగా.. సీతగా సాయిపల్లవి కనిపించనుంది. యశ్ రావణుడి పాత్రను పోషించాడు.
This post was last modified on July 8, 2025 11:03 am
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…