అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ కు ప్రభాస్ ఆర్థిక సహాయం చేస్తాడని, కిడ్నీ దాతలు ఎవరైనా దొరికితే తనకు ఫోన్ చేయమని చెప్పాడని అతని కుటుంబ సభ్యులు నిన్న మీడియాతో చెప్పడం చాలా దూరం వెళ్ళింది. నిజానికి ప్రభాస్ టీమ్ నుంచి కాల్ వెళ్లలేదట. ఎవరో అగంతక వ్యక్తి ప్రభాస్ అసిస్టెంట్ గా పరిచయం చేసుకుని యాభై లక్షలు అందజేస్తామని, దాతలు దొరికాక సంప్రదించమని చెప్పాడట. ఇది సోషల్ మీడియాలో వైరలయ్యింది. కొన్ని గంటల అనంతరం ఎవరైతే ఈ ఫేక్ కాల్ చేశారో సదరు వ్యక్తి నెంబర్ స్విచ్ అఫ్ వస్తోంది. అంటే ఇది పక్కా ఫేక్ కాల్ గా భావించవచ్చు.
ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పాడైపోయి ఆసుపత్రి బెడ్ మీద పోరాడుతున్నారు. ఇలాంటి టైంలో స్టార్ హీరోల పేరు చెప్పి కొందరు ఇలాంటి స్టంట్స్ చేయడం ఖండించాల్సిన విషయం. నిజంగా ఎవరైనా సాయం చేయాలి అనుకుంటే తమ మనుషులను వ్యక్తిగతంగా పంపించి వీడియో కాల్ లో మాట్లాడతారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వాళ్ళు అలాగే తమ ఫ్యాన్స్ కి ఊరట కలిగించారు. కానీ ప్రభాస్ సహాయకుడిగా ఒకడు ఫోన్ చేసి ఇలా నమ్మించడం సరికాదు. ఫిష్ వెంకట్ ఒకరికే కాదు ఇండస్ట్రీలో ఎందరో హీరోలతో చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆరిస్టుగా ఎన్నో పాత్రలు పోషించాడు.
సినీ ప్రియులు వీలైనంత త్వరగా ఫిష్ వెంకట్ కోలుకోవాలని కోరుకుంటున్నారు. గతంలో తన ఆరోగ్యం గురించి పవన్, చిరంజీవి స్పందించడం గురించి ఇటీవలే ఆయన కూతురు వివరణ ఇచ్చింది. ఇలాంటి విషయాల్లో మా అసోసియేషన్ చొరవ తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫిష్ వెంకట్ అందులో సభ్యుడో కాదో కానీ టాలీవుడ్ కు చెందిన సీనియర్ నటుడు కాబట్టి ఎంతో కొంత సాయం అందేలా చొరవ తీసుకుంటే బాగుంటుందని కొందరు నటీనటులు అంటున్నారు. ఫిష్ వెంకటే కాదు ఆవాసాన దశలో ఇలాంటి సమస్యలతో బాధ పడుతూ ఆర్థిక మద్దతు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వందల్లో ఉంటారు.
This post was last modified on July 5, 2025 4:47 pm
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…