Movie News

కన్నప్పకు ఇంకో ఛాన్స్ దొరికింది కానీ

మొదటి మూడు రోజులు అదరగొట్టిన కన్నప్ప తర్వాత వీక్ డేస్ నుంచి హఠాత్తుగా నెమ్మదించడం ఊహించని పరిణామం. చాలా చోట్ల సగం ఆక్యుపెన్సీలు కూడా లేవని బయ్యర్స్ టాక్. మెయిన్ సెంటర్స్ లో ఓ మోస్తరుగా వసూళ్లు ఉన్నా మంచు విష్ణు చెప్పుకున్న బడ్జెట్ ప్రకారం బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ రెస్పాన్స్ సరిపోదు. అనూహ్యంగా పికప్ కావాల్సిందే. ముఖ్యంగా రెండో వీకెండ్ ని వాడుకోవడం కీలకం కానుంది. తాజాగా రిలీజైన నితిన్ తమ్ముడుకొచ్చిన స్పందన చూస్తుంటే కన్నప్పకు ఇంకో అవకాశం దొరికిందనే చెప్పాలి. కానీ దాన్ని ఎంతమేరకు వాడుకుంటాడనే దాని మీదే ఫైనల్ స్టేటస్ ఆధారపడింది

ఓపెనింగ్స్ పరంగా ప్రభాస్ క్యామియో ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువ రిజల్ట్ ఇచ్చింది. ఫలితంగా విష్ణు కెరీర్ లోనే అతి పెద్ద గ్రాసర్ గా కన్నప్ప నిలిచింది. అయితే ఇది చాలదు. మంచు ఫ్యామిలీ ఆశించింది ఇది కాదు. మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్ దాటే స్థాయిలో నమ్మకం పెట్టుకున్నారు. ప్రభాస్ తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్ పాత్రలు దానికి దోహదం చేస్తాయని ఆశించారు. కానీ పికప్ అయినట్టే కనిపించిన హిందీ వెర్షన్ సైతం వేగంగా డ్రాప్ కావడం షాకని చెప్పాలి. ప్రీ రిలీజ్ వరకు అగ్రెసివ్ ప్రమోషన్లు చేసిన 24 ఫ్రేమ్స్ హఠాత్తుగా సైలెంట్ కావడం సోషల్ మీడియా సౌండ్ తగ్గించేసింది.

సో ఇక్కడి నుంచి కన్నప్ప హిట్టు ముద్ర వేయించుకోవాలంటే మిరాకిల్ జరగాలి. విష్ణు ఆ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడేమో కానీ మళ్ళీ ఫ్రెష్ పబ్లిసిటీ మొదలుపెడితే పరిస్థితి మరింత మెరుగు పడొచ్చు. కానీ ఆ దిశగా చర్యలు తక్కువగానే ఉన్నాయి. స్వాములు, సెలబ్రిటీలను తీసుకొచ్చి షోలు వేసి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు తప్పించి మార్కెటింగ్ పరంగా కన్నప్ప చేయాల్సింది ఇంకా చాలానే ఉంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం, స్టీఫెన్ దేవస్సి సంగీతం వంద శాతం అంచనాలు అందుకోలేని మాట వాస్తవం. వచ్చే వారం ఘాటీ వాయిదా పడిన మరో సానుకూలాంశం కన్నప్పకు ఉంది. మరి ఎలా వాడుకుంటాడో చూడాలి.

This post was last modified on July 5, 2025 1:59 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

23 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

59 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

1 hour ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago