నిన్న విడుదలైన రన్బీర్ కపూర్ రామాయణ టైటిల్ గ్లిమ్ప్స్ చూసి కొందరు ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. నిజానికి మూడు నిముషాలు వీడియోలో చొక్కాలు చింపుకునే కంటెంట్ ఏమీ చూపించలేదు. మీడియాకు ప్రసాద్ మల్టీప్లెక్స్ బిగ్ స్క్రీన్ లో చూపించారు కాబట్టి అక్కడ అనుభూతి బెటర్ గా అనిపించింది కానీ స్టన్నింగ్ అనిపించే విజువల్ ఎఫెక్ట్స్, అబ్బురపరిచే గ్రాఫిక్స్ ఏవీ రివీల్ చేయలేదు. యానిమేషన్ ని రిచ్ గా ప్రొజెక్ట్ చేయడం వల్ల టెక్నికల్ టీమ్ పేర్లు రివీల్ చేసిన విజువల్స్ బాగున్నాయనిపించింది. అన్నింటి కన్నా ముఖ్యంగా హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ కు ప్రత్యేక ప్రశంసలు దక్కుతాయి.
ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ కొందరు సోషల్ మీడియాలో ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ ని తీసుకొచ్చి ఫ్రెష్ గా ట్రోల్ చేస్తున్నారు. రామాయణ తీసే పద్దతి ఇదేనంటూ క్లాసులు తీసుకుంటున్నారు. నిజానికి రామాయణ అసలు టీజర్ వచ్చి, అందులో ఆర్టిస్టులను చూపించి, ఎలాంటి విఎఫ్ఎక్స్ ఉందో కొన్ని శాంపిల్స్ వదిలి ఉంటే అప్పుడు ఎగతాళి చేసినా దానికో అర్థం ఉంటుంది. అంతే తప్ప కేవలం టైటిల్ రివీల్ ని పట్టుకుని ఆదిపురుష్ ని టార్గెట్ చేయడం కామెడీనే అవుతుంది. ఇదేదో ఓం రౌత్ ని సమర్ధించే ప్రయత్నం కాదు. పోలికలు తెస్తున్నప్పుడు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనే విశ్లేషణ అంతే.
వచ్చే సంవత్సరం దీపావళి రిలీజ్ కాబట్టి రామాయణ టీమ్ ప్రమోషన్ల విషయంలో తొందరపాటు చూపించడం లేదు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న పార్ట్ 1 వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్ళిపోయింది. ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ అంటున్నారు కాబట్టి దాన్ని తగ్గ కంటెంట్ స్క్రీన్ మీద కనిపిస్తేనే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. లేదంటే ఆదిపురుష్ కు జరిగిన సీనే రిపీట్ అవుతుంది. అసలే రావణుడిగా యష్ ప్రీ లుక్ ని కెజిఎఫ్ స్టైల్ లో చూపించడం మీద ధర్మ సందేహాలు మొదలయ్యాయి. దర్శకుడు నితేశ్ తివారి మాత్రం ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చూడని ఎక్స్ పీరియన్స్ ఇస్తానని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates