కూలీ నుంచి అమీర్ ఖాన్ ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలయ్యింది. క్యాస్టింగ్ మొత్తంలో చివరి పోస్టర్ తనదే కావడం గమనార్హం. క్లైమాక్స్ లో ఎనిమిది నుంచి పది నిముషాలు మాత్రమే కనిపించే ప్రత్యేక క్యామియోలో ఈ పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. విక్రమ్ లో సూర్య పోషించిన రోలెక్స్ క్యారెక్టర్ ని అత్యద్భుతంగా చూపించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడు అదే మేజిక్ రిపీట్ చేస్తాడనే నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే విక్రమ్ లో కమల్ తో పాటు సూర్య ఒకడే ఉన్నాడు కాబట్టి ఇబ్బంది రాలేదు. కానీ కూలీలో రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్రలతో కాంబినేషన్ మాములుగా లేదు.
ఇన్ సైడ్ టాక్ అయితే మరీ రోలెక్స్ రేంజ్ లో కాకపోయినా అమీర్ ఖాన్ చేసిన దహా రోల్ శక్తిమంతంగా ఉంటుందని, నాగ్, ఉపేంద్ర పాత్రలకు సంబంధించిన ట్విస్ట్ పూర్తయ్యాక దీని ఎంట్రీ వస్తుందని అంటున్నారు. ఎంతవరకు నిజమో రిలీజయ్యే దాకా చూడాలి. తనకు సోలో హీరోగా లోకేష్ కనగరాజ్ ఒక సినిమా చేసే హామీ మీదే అమీర్ ఖాన్ ఈ కూలిలో క్యామియోకు ఒప్పుకున్నాడు. దాని షూటింగ్ ఖైదీ 2 అయ్యాక మొదలవుతుంది. తన కెరీర్ ప్రారంభంలో లోకేష్ రాసుకున్న ఒక సూపర్ హీరో కథనే అమీర్ ఖాన్ తో తెరకెక్కబోతోంది. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న కూలి మీద ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. అదే రోజు పోటీలో వార్ 2 ఉన్నా సరే తెలుగు రాష్ట్రాల హక్కులు 50 కోట్లకు పైగా అమ్ముడుపోవడం ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వంద కోట్ల గ్రాస్ సాధిస్తుందనే నమ్మకంతో ఏషియన్ సంస్థ పెద్ద రిస్క్ చేస్తోంది. బజ్ అయితే దానికి తగ్గట్టే పీక్స్ లో ఉంది. ఈ నెల మూడో వారం నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారు. హైదరాబాద్ లోనూ ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని సమాచారం. ఈ నెలాఖరున చెన్నైలో నెహ్రు స్టేడియం వేదికగా మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ సమక్షంలో ఆడియో లాంచ్ చేయబోతున్నారు.
This post was last modified on July 4, 2025 6:34 am
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…