భారతీయ సినీ సంగీతంలో రెహమాన్‌కు ఒక ప్రత్యేక అధ్యాయం కేటాయించాల్సిందే. తొలి చిత్రం ‘రోజా’తోనే తన లెవెలే వేరని చాటిన రెహమాన్.. అనతి కాలంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయాడు. ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు సాధించిన ఘనత ఆయన సొంతం. ఒకప్పటితో పోలిస్తే రెహమాన్ సంగీతంలో క్వాలిటీ తగ్గిందనే విమర్శలు ఉన్నప్పటికీ ఆయన మనసు పెట్టి పని చేస్తే ఔట్ పుట్ ఎంత బాగుంటుందో చెప్పడానికి గత ఏడాది రాయన్, చావా లాంటి సినిమాలు ఉదాహరణగా నిలిచాయి. ప్రస్తుతం ఆయన పని చేస్తున్న మెగా ప్రాజెక్టుల్లో ‘రామాయణం’ ఒకటి. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఇదొకటి.
ఈ సినిమా నుంచి ఈ రోజే టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. దానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ గ్లింప్స్‌లో ఉన్న వావ్ ఫ్యాక్టరే సినిమాలోనూ ఉంటే.. ఇండియన్ ఫిలిం కలెక్షన్ల రికార్డులన్నీ బద్దలైపోయే స్థాయిలో ఈ చిత్రం విజయం సాధించడం ఖాయం. ఐతే ఈ సినిమాకు సంగీత బాధ్యతలు రెహమాన్ ఒక్కడే నిర్వర్తించట్లేదు. మ్యూజిక్ క్రెడిట్స్‌లో రెహమాన్‌తో పాటు హన్స్ జిమ్మర్ అనే మరో పేరు కూడా కనిపించింది. రెహమాన్ సంగీతం అందిస్తున్న చిత్రంలో మరొకరు వేలు పెట్టడం ఏంటి అని ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఐతే ఈ హన్స్ జిమ్మర్ సామాన్యుడేమీ కాదు.
రెహమాన్ లాగే ఆస్కార్ అవార్డు సాధించిన ఘనుడు జిమ్మర్. రెండు వేర్వేరు చిత్రాలకు అతను అకాడమీ అవార్డు సాధించాడు. అతను జర్మనీ మ్యూజిక్ కంపోజర్. అంతర్జాతీయ స్థాయిలో జిమ్మర్‌కు గొప్ప పేరే ఉంది. గ్రామీ, బాఫ్టా, ఎమ్మీ.. ఇలా ప్రెస్టీజియస్ అవార్డులెన్నో సాధించాడు. డైలీ టెలిగ్రాఫ్.. ప్రకటించిన 100 లివింగ్ జీనియసెస్‌లో జిమ్మర్ ఒకడు. రామాయణం చిత్రాన్ని ఒక ఎపిక్‌గా తీర్చిదిద్దడానికి అనేకమంది అంతర్జాతీయ టెక్నీషియన్లను తీసుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అకాడమీ అవార్డు సాధించిన కంపెనీకి అప్పగించారు. ఈ క్రమంలోనే స్కోర్ కోసం జిమ్మర్‌ను ఎంచుకున్నట్లున్నారు. సినిమాను బెస్ట్ క్వాలిటీలో తీసుకురావడమే కాక.. అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేయడానికి కూడా ఇలా చేసి ఉండొచ్చు.
This post was last modified on July 3, 2025 8:25 pm
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్‌కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…