ఏపీ డిప్యూటీ సిఎం అయ్యాక పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమాగా హరిహర వీరమల్లు మీద ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలు అన్నీఇన్నీ కావు. అయిదేళ్ల సుదీర్ఘ నిర్మాణంలో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీ వాయిదా వల్ల బజ్ తగ్గించుకున్నప్పటికీ ట్రైలర్ తో వాటిని సరిచేస్తామని నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఆ ఘడియ రానే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన కేంద్రాల్లో థియేటర్ సెలబ్రేషన్స్ మధ్య ట్రైలర్ లాంచ్ జరిగింది. హైదరాబాద్ విమల్ 70 ఎంఎంలో జరిగిన ఈవెంట్ కు టీమ్, మీడియా మొత్తం విచ్చేసింది. మూడు నిమిషాల విజువల్ గ్రాండియర్ రిలీజ్ చేశారు.
ఎనిమిదో శతాబ్దంలో ఔరంగజేబు (బాబీ డియోల్) అకృత్యాలు దేశంలో కొనసాగుతూ ఉండగా వాటిని అడ్డుకునే లక్ష్యంతో గోల్కొండ నుంచి బయలుదేరతాడు వీరమల్లు (పవన్ కళ్యాణ్). దేశమే గర్వించే అపురూప సంపద కోహినూర్ వజ్రం తేవడంతో పాటు ప్రమాదంలో ఉన్న పంచమి (నిధి అగర్వాల్) ని కాపాడే బాధ్యత వీరమల్లు మీద పడుతుంది. లక్షల్లో ఉన్న నిజాం సైన్యాన్ని ఎదిరించడం, హిందూ ధర్మాన్ని నిలబెట్టి మహత్తరమైన కార్యం తన చేతిలో ఉంటుంది. ఇవన్నీ ఒక్కడే ఇది ఎలా సాధించాడు. వీరమల్లు కర్తవ్య నిర్వహణలో వచ్చిన అడ్డంకులు ఎలాంటివి లాంటి ప్రశ్నలకు సమాధానం జూలై 24 తెలియనుంది.
అంచనాలకు మించి అవుట్ ఫుట్ ఇవ్వడంలో దర్శకుడు జ్యోతికృష్ణ సఫలమైనట్టే ఉంది. పులిని వేటాడే బెబ్బులి, నేను రావద్దని కోరుకుంటున్నారు లాంటి డైలాగులు బాగా పేలాయి. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా గ్యాప్ తర్వాత పర్ఫెక్ట్ సింక్ తో సీన్లను ఎలివేట్ చేసేలా ఉంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు ఆర్ట్ వర్క్, విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెప్పించేలా ఉన్నాయి. బాబీ డియోల్, సునీల్, కబీర్ సింగ్, తనికెళ్ళ భరణి తదితర ఆర్టిస్టులను రివీల్ చేశారు. చార్మినార్ నేపధ్యాన్ని రీ క్రియేట్ చేయడం, యాక్షన్ కొరియోగ్రఫీ బాగున్నాయి. ఇదే రేంజ్ లో మొత్తం సినిమా ఉంటే వీరమల్లు రికార్డులకు బాక్సాఫీస్ దాసోహమే.
This post was last modified on July 3, 2025 12:07 pm
అమెరికా వీసా (H-1B, H-4) కోసం అప్లై చేసేవారికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇకపై ఇంటర్వ్యూకి వెళ్లేముందు సర్టిఫికెట్లు సరిచూసుకోవడమే…
దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకపక్క రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90 దాటి పాతాళానికి…
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…