రేపు టాలీవుడ్ కు బిగ్ డే అని చెప్పాలి. ఒకే రోజు, ఇంచుమించు ఒకే సమయంలో రెండు క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ కి సంబంధించిన ఈవెంట్స్ జరగనున్నాయి. హరిహర వీరమల్లు ట్రైలర్ కోసం అభిమణులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మళ్ళీ చెప్పనక్కర్లేదు. మిత్రులు ఆనంద్ సాయి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చూసి ఆనందం వ్యక్తం చేసిన వీడియో ఆల్రెడీ సోషల్ మీడియాలో తిరుగుతోంది. రేపు ఏపీ తెలంగాణ మెయిన్ సెంటర్స్ లో ట్రైలర్ లాంచ్ ని అభిమానులు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయబోతున్నారు. విజువల్స్ గురించి ప్రీ టాక్ చాలా పాజిటివ్ గా ఉంది.
ఇంత హంగామా ఉంది కాబట్టి సోషల్ మీడియా అటెన్షన్ మొత్తం హరిహర వీరమల్లు మీదే ఉంటుందని తొలుత భావించినా ఇప్పుడో ట్విస్టు వచ్చి పడింది. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందిన రామాయణ మొదటి గ్లిమ్ప్స్ ని రేపు హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్సులో పెద్ద ఎత్తున లాంచ్ చేస్తున్నారు. ఆదిపురుష్ తో సహా రామాయణ గాథ కొన్ని వందలసార్లు తెరకెక్కినప్పటికీ ఇప్పుడు చూడబోయేది మాత్రం విజువల్ వండర్ లా ఉంటుందని టీమ్ హామీ ఇస్తోంది. రన్బీర్ కపూర్, సాయిపల్లవి, యష్, సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తోంది. రీచ్ చాలా భారీగా ఉండబోతోంది.
రేపు ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. పవన్ ఫ్యాన్స్ మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నారు. రామాయణ ఇంకో రోజు రిలీజ్ చేయాల్సిందని, ఇప్పుడు జనాల అటెన్షన్ ని పంచుకోవాల్సి వస్తోందని ఫీలవుతున్నారు. దేనికవే బడ్జెట్ పరంగా వందల కోట్లతో తీసిన సినిమాలు. వీరమల్లు ఈ జూలై 24 విడుదల కాబోతుండగా రామాయణ వచ్చే సంవత్సరం దీపావళికి లాక్ చేసుకుంది. ఇంత ముందుగా ప్రమోషన్లు ఎందుకు చేస్తున్నారంటే బిజినెస్ కోసమట. చిన్న సాంపిల్ తోనే బయ్యర్లు ఎగబడే రేంజ్ లో వీడియో కట్ ఉందని ముంబై టాక్. అదెంత వరకు నిజమో రేపు ఈ సమయానికి తేలిపోతుంది. చూద్దాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates