మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం.. కన్నప్ప. పుష్కర కాలం కిందటే దీని కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఎంతో కష్టపడి.. బడ్జెట్ పరంగా ఎంతో రిస్క్ చేసి ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. గత వారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. టాక్ కొంచెం మిక్స్డ్‌గా ఉన్నప్పటికీ తొలి వారాంతంలో ఈ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది. కానీ వీకెండ్ తర్వాత కలెక్షన్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. వీక్ డేస్‌లో ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంటోంది ‘కన్నప్ప’.
ఈ వీకెండ్లో ‘తమ్ముడు’తో పాటు ‘3 బీహెచ్‌కే’ రిలీజవుతున్నాయి. వీటి పోటీని తట్టుకుని ‘కన్నప్ప’ ఏమాత్రం పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఈ సినిమా బడ్జెట్ ఏమో రూ.200 కోట్లకు పైమాటే అంటున్నారు. థియేట్రికల్ సహా ఏ హక్కులనూ రిలీజ్‌కు ముందు అమ్మలేదు మంచు విష్ణు. థియేటర్ల నుంచి సగం ఆదాయం అయినా రాబడితే.. మిగతాది నాన్-థియేట్రికల్ హక్కులతో వర్కవుట్ చేద్దామనుకున్నాడు. కానీ థియేటర్ల నుంచి ఈ చిత్రం నాలుగో వంతు బడ్జెట్ రివకరీ చేయడం కూడా కష్టంగానే కనిపిస్తోంది.
ఐతే థియేటర్లలో వసూళ్లు పడిపోతున్న దశలో నాన్-థియేట్రికల్ బిజినెస్‌లో ‘కన్నప్ప’కు మంచి ఆరంభం దక్కినట్లు తెలుస్తోంది. ‘కన్నప్ప’ హిందీ శాటిలైట్ హక్కులు రూ.20 కోట్లు పలికాయట. ముంబయికి చెందిన ఒక ఏజెన్సీ ఈ రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. తర్వాత వాళ్లు ఏదైనా ఛానెల్‌కు మారు బేరానికి అమ్ముకుంటారట. ‘కన్నప్ప’కు హిందీలో డీసెంట్ టాకే వచ్చింది. వసూళ్లు గొప్పగా లేవు కానీ.. పర్వాలేదు. ఇలాంటి ఈవెంట్ ఫిలిమ్స్‌కు హిందీ శాటిలైట్‌లో మంచి స్పందన ఉంటుందని ఆశిస్తున్నారు. అందుకే మంచి రేటు ఇచ్చి హక్కులు తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ చిత్రానికి డిజిటల్ హక్కులు కూడా మంచి రేటు పలికే అవకాశముంది. విడుదలకు ముందు ఆశించిన రేటు రాలేదని విష్ణు ఆ హక్కులను అమ్మని సంగతి తెలిసిందే. ఇంకా తెలుగులో శాటిలైట్ రైట్స్ కూడా అమ్మాల్సి ఉంది. మొత్తం బడ్జెట్ రికవరీ సాధ్యం కాకపోయినా.. మంచు విష్ణు తక్కువ నష్టాలతో బయటపడ్డా గొప్పే. మరి అన్ని హక్కులూ అమ్మేసరికి అతను ఎంత వెనక్కి తెచ్చుకుంటాడో చూడాలి.
This post was last modified on July 2, 2025 1:02 pm
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…