సోషల్ మీడియాలో రామ్ చరణ్ మీద పెద్ద చర్చే జరుగుతోంది. ఎన్నడూ లేనిది నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం, అందులో గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత హీరో, దర్శకుడు కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదనే రీతిలో కామెంట్ చేయడం ఫ్యాన్స్ లో దుమారం రేపింది. ఒకపక్క తమ్ముడు రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ గిల్ట్ పోగొట్టుకోవడం కోసమైనా చరణ్ తో ఒక హిట్ మూవీ ప్లాన్ చేస్తానని, త్వరలోనే ప్రకటన ఆశించవచ్చని చెప్పడం ఇంకా ఫ్రెష్ గా ఉండగానే ఇంకోవైపు శిరీష్ అన్న మాటలు రకరకాల అర్థాలకు దారి తీశాయి. ఇది అవసరం లేని రాద్ధాంతానికి దారి చూపాయి.
ఎవరు ఎలా అనాలిసిస్ చేసుకున్నా గేమ్ ఛేంజర్ జాప్యానికి, ప్రొడక్షన్ కాస్ట్ కి రామ్ చరణ్ బాధ్యుడు కాదనేది ఓపెన్ ఫాక్ట్. దర్శకుడు శంకర్ ఏడు గంటల ఫుటేజ్ తీసి, పాటల కోసమే వందల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సింది ఖచ్చితంగా ప్రొడ్యూసరే. ఆ మాట దిల్ రాజే ఒప్పుకున్నారు. కండీషన్లు లేకపోవడంతో ఆ ప్యాన్ ఇండియా మూవీ మీద నియంత్రణ పోయిందని బాహాటంగా చెప్పారు. పైగా మూడేళ్ళ విలువైన టైంని ఒక ఫ్లాప్ డైరెక్టర్ కు చరణ్ ఇవ్వడమంటే కథను గుడ్డిగా నమ్మడమే. అది వర్కౌట్ అవుతుందనే నమ్మకంతోనే కదా దిల్ రాజు ఇంత రిస్క్ తీసుకుని ప్రొసీడ్ అయ్యింది. అలాంటప్పుడు నింద ఒకరికే రాదు.
ఇంత దారుణమైన రిజల్ట్ కు కారణమైన శంకర్ ఎక్కడో దూరంగా ఉంటే ఆరు నెలల తర్వాత కూడా గేమ్ ఛేంజర్ మీద ఇంకా టాపిక్ జరుగుతూ ఉండటం విచిత్రం. అయినా డిజాస్టర్లు ఇండస్ట్రీకి కొత్త కాదు. ఇంతకు మించినవి ఎన్నో దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. నష్టాలు తట్టుకోలేక పరిశ్రమ వదిలి వెళ్ళిపోయినవాళ్ళు, ఒక్క ఫ్లాపుతో జీవితం ఎందుకని భావించిన వాళ్ళు వందల్లో ఉంటారు. వాటన్నింటికి హీరోలే బాధ్యత తీసుకోరు. పెద్ది కోసం ఎదురు చూస్తున్న చరణ్ అభిమానులు ఈ పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అకారణంగా గేమ్ ఛేంజర్ ఇష్యూని పదే పదే లైమ్ లైట్ లోకి తేవడం పట్ల కాసింత కినుకుగానే ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates