ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఊపేసిన వెబ్ సిరీస్ లలో మనీ హీస్ట్ తర్వాత చెప్పుకోవాల్సింది స్క్విడ్ గేమ్ గురించే. కోట్లాది ఆడియన్స్ ని కట్టిపడేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూడో సీజన్ ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాలంటే ఇండియాలోనూ దీనికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. డబ్బు కోసం ప్రాణాలతో చెలగాటమాడే క్రూరమైన ఆటల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన స్క్విడ్ గేమ్ ఒరిజినల్ భాష కొరియన్. అయినా ఇంగ్లీష్ లాంటి ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ తో పాటు డబ్బింగ్ పుణ్యమాని తెలుగు లాంటి స్థానిక భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.
ఇంత హైప్ ఉన్న స్క్విడ్ గేమ్ 3కి సోషల్ మీడియాలో అంతగా సౌండ్ లేకపోవడం విచిత్రమే అయినా వరల్డ్ వైడ్ రెస్పాన్స్ చాలా పాజిటివ్ గా ఉంది. సీజన్ 2 కి వచ్చిన మిశ్రమ స్పందనని దృష్టిలో పెట్టుకుని ఈసారి గేరు మార్చారు. కథలో హ్యూమన్ యాంగిల్ జోడించారు. మొదటిసారి విజేతగా నిలిచిన జీ హున్ ఈసారి ఎలాగైనా ఈ గేమ్ ఆడించే వాళ్ళను చంపేసి అమాయకుల ప్రాణాలు పోకూడదని కంకణం కట్టుకుంటాడు. ప్రమాదరకమైన ఆ వలయంలోకి అడుగు పెడతాడు. తర్వాత జరిగే పరిణామాలు స్క్రీన్ మీద చూడాలి. ముందు లాగా కాకుండా ఈసారి కేవలం మూడు గేమ్స్ కే పరిమితం చేశారు.
తగినంత డ్రామా, ఎమోషన్స్ పుష్కలంగా ఉన్న స్క్విడ్ గేమ్ లో చిన్న పాపను సెంటర్ పాయింట్ గా మార్చి నాటకీయతను పెంచడం ఆకట్టుకుంటుంది. తల్లి కొడుకుల బంధం, హిజ్రా ట్రాక్, డ్రగ్స్ కి అలవాటు పడిన వ్యక్తి, ఆత్మల కనెక్షన్ ఇలా సంబంధం లేని థ్రెడ్స్ ని ముడిపెట్టడంలో దర్శకుడు వాంగ్ డాంగ్ హుక్ సక్సెసయ్యాడు. స్క్విడ్ గేమ్ వీరాభిమానులను ఈ థర్డ్ పార్ట్ బాగా మెప్పిస్తుంది. మొదటి రెండు సీజన్లు చూడని వాళ్లకు కనెక్ట్ కావడం కొంచెం కష్టం. ఇది ముగింపుని ప్రమోషన్లలో చెప్పారు కానీ సీజన్ 4కు కావాల్సిన లీడ్ అయితే క్లైమాక్స్ లో వదిలారు. సో అయిపొతుందెమోననే టెన్షన్ అక్కర్లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates