కొన్ని వందల వేలసార్లు టీవీలో టెలికాస్ట్ అయినా, యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వచ్చినా అతడు థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం మహేష్ బాబు అభిమానులు మాములుగా ఎదురు చూడటం లేదు. ఆగస్ట్ 9 తన పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ ఏరియాల బయ్యర్ల నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. కొన్ని ప్రాంతాలకు కోటి రూపాయల దాకా డిమాండ్ ఉందంటే క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ప్రమోషన్ల విషయంలోనూ ఫ్యాన్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నారట. ఆల్ టైం రికార్డులు వచ్చే సూచనలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ టాక్.
ఇదిలా ఉండగా అతడు ఒక కొత్త ప్రయోగం చేస్తోంది. మాములుగా కొత్త సినిమాల OST (ఒరిజినల్ సౌండ్ ట్రాక్) లు థియేటర్ రిలీజ్ అయ్యాక యూట్యూబ్, ఇతర మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల చేస్తారు. కొన్నిసార్లు ఇవి చాలా లేటవుతాయి. ఎందుకంటే ఇదేదో తేలిగ్గా ప్రింట్ నుంచి సౌండ్ తీసుకుని వదిలేది కాదు. సంగీత దర్శకుడు మళ్ళీ కూర్చుని మిక్సింగ్ కు సంబంధించిన పనులు చూసుకోవాలి. క్రాస్ చెక్ చేయాలి. డాకు మహారాజ్ లేట్ కావడానికి కారణం ఇదే. ఇప్పుడు ఆతడు ఓఎస్టిని త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. డైలాగులు లేకుండా కేవలం మణిశర్మ బిజీఎం ఆడియోలో ఆస్వాదించవచ్చు.
ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాకు ఇలా చేయడం కొత్తే. అతడు సౌండ్ ట్రాక్ సుమారుగా 50 నిముషాలు ఉంటుంది. పార్థు పాత్ర పరిచయం దగ్గరి నుంచి నాజర్ ఇంటికి వెళ్ళాక జరిగే సంఘటనల వరకు సీన్స్ కు తగ్గట్టుగా మణిశర్మ గొప్ప స్కోర్ ఇచ్చారు. చూడకుండా వినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడిది కనక సక్సెస్ అయితే ఇతర పాత సినిమాల రీ రిలీజ్ టైంలోనూ ఈ తరహా ostలను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడులో త్రిష గ్లామర్, మహేష్ బాబు కూల్ హీరోయిజం, పాటలు, ట్విస్టులు ఒకదాన్ని మించి మరొకటి థియేటర్ లో బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం ఖాయం.
This post was last modified on June 29, 2025 7:27 pm
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…