మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టు.. రెండు రోజుల కిందటే థియేటర్లలో దిగింది. మేకర్స్ చెప్పిన ప్రకారం దీని బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే. సినిమాకు ఆశించిన బిజినెస్ ఆఫర్లు రాకపోవడంతో చాలా ఏరియాల్లో కమిషన్ బేసిస్‌లో మంచు విష్ణునే స్వయంగా సినిమాను రిలీజ్ చేశాడు. ఈ చిత్రానికి రిలీజ్‌కు ముందు ఓటీటీ డీల్ కూడా కుదుర్చుకోలేదు విష్ణు. విడుదల తర్వాత సినిమా అదరగొడుతుందని.. తాను కోరుకున్న రేట్ వస్తుందని అతను ఆశించాడు.
ఈ నేపథ్యంలో ‘కన్నప్ఫ’ ఏమేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. ఐతే చారిత్రక నేపథ్యం ఉన్న కథ కావడం, పెద్ద స్కేల్లో రూపొందించడం.. అన్నింటికీ మించి ప్రభాస్ సహా కొందరు పేరున్న నటీనటులు కీలక పాత్రలు పోషించడంతో తొలి రోజు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్స్‌తో సినిమా రన్ అయింది. డే-1 దగ్గర దగ్గర రూ.20 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టి మంచు విష్ణు అండ్ కోలో ఆనందాన్ని నింపింది ‘కన్నప్ప’.
ఐతే సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో రెండో రోజు ‘కన్నప్ప’ ఏమాత్రం నిలబడుతుందో అని సందేహించారు ట్రేడ్ పండిట్లు. కానీ ‘కన్నప్ప’ వసూళ్లలో పెద్ద డ్రాప్ ఏమీ లేదు. రెండో రోజు కూడా తొలి రోజుకు దీటుగా వసూళ్లు వచ్చాయి. శనివారం కూడా రూ.20 కోట్లకు దగ్గరగా గ్రాస్ వచ్చినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు నిలకడగా ఉండగా.. తొలి రోజు హిందీలో నామమాత్రపు కలెక్షన్లు తెచ్చిన ఈ సినిమా రెండో రోజు పుంజుకుంది.
అక్కడ సౌత్ నుంచి వచ్చే పాన్ఇండియా సినిమాలకు నెమ్మదిగానే వసూళ్లు పుంజుకుంటాయి. బాహుబలి, పుష్ప సహా చాలా చిత్రాలకు ఇదే జరిగింది. ‘కన్నప్ప’ హిందీ వెర్షన్‌కు తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు 40 శాతం మేర వసూళ్లు పెరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళం, మలయాళంలో మాత్రం ‘కన్నప్ప’కు ఆశించిన స్పందన లేదు. ఐతే తెలుగు, హిందీలో బాగా ఆడితే విష్ణు అండ్ టీం పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్లే. ఆదివారం ఈ సినిమాకు తొలి రెండు రోజులకు మించి వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు.
This post was last modified on June 29, 2025 3:47 pm
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…