మంచు ఫ్యామిలీకి చాన్నాళ్ల తర్వాత ఓ మంచి విజయం దక్కేలా కనిపిస్తోంది కన్నప్ప రూపంలో. ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది. తొలి రోజు ఈ సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ వసూళ్లతో రన్ అయింది. శనివారం కూడా వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. ఈ సందర్భంగా తన టీంతో కలిసి మంచు విష్ణు సక్సెస్ ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కన్నప్ప సీక్వెల్ గురించి విలేకరులు అడిగితే ఆసక్తికర విషయం చెప్పాడు విష్ణు. ప్రస్తుతం టాలీవుడ్ లీడింగ్ డైరెక్టర్లలో ఒకరైన వ్యక్తి.. కన్నప్ప ప్రీక్వెల్ ప్రపోజల్ తన ముందు పెట్టినట్లు విష్ణు వెల్లడించాడు. ఆయనకు కన్నప్ప నచ్చి.. తిన్నడి మీదే ఒక సెపరేట్ మూవీ చేద్దాం అంటూ తనను అడిగారన్నాడు విష్ణు.
తిన్నడు కన్నప్ప కావడానికి ముందు అతడి కథను ఈ సినిమాలో చూపిద్దాం, మీకు ఆసక్తి ఉందా అని విష్ణును ఆ దర్శకుడు అడిగాడట. ఐతే స్క్రిప్టు రెడీ అయితే చూద్దాం అన్నానని.. ఒకవేళ కన్నప్ప ఫ్రాంఛైజీలో ఇంకో సినిమా చేయాలనిపిస్తే ఇదే చేస్తానని విష్ణు నవ్వుతూ చెప్పాడు.
కన్నప్ప సినిమా తనకు ఎంతో నేర్పించిందని చెప్పిన విష్ణు.. అణకువతో ఉండడం అందులో అత్యంత ముఖ్యమైన పాఠం అని చెప్పాడు. మోహన్ లాల్‌తో కలిసి చేసిన ప్రయాణం వల్ల తనకు ఈ పాఠం తెలిసిందన్నాడు విష్ణు.
ఈ సినిమాకు ముందు తన మీద చాలా వ్యతిరేకత వచ్చిందని.. తన మీద అకారణంగా ద్వేషం చూపించారని.. తన ప్రతిభను ప్రశ్నించారని… అలాంటి సమయంలో తన కుటుంబం తనకు ఎంతో అండగా నిలిచిందని.. ముఖ్యంగా తన భార్య వెరోనికా సహకారం మరువలేనిదని విష్ణు చెప్పాడు. ఈ సినిమాతో ట్రోలర్స్‌కు అవకాశం లేకుండా చూసుకున్నామన్న విష్ణు.. సినిమాలో కీలక మలుపు గురించి మాట్లాడాడు.
అందరూ ప్రభాస్ వచ్చాకే సినిమా ఊపందుకుందని అంటున్నారని.. కానీ తన దృష్టిలో శరత్ కుమార్ పాత్ర సన్నివేశం దగ్గరే సినిమా అసలైన మలుపు తిరిగిందని.. అక్కడి నుంచి మంచి టెంపోతో సాగిందని అభిప్రాయపడ్డాడు విష్ణు. ఈ సినిమా కోసం ప్రభాస్ చేసిన దానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని మరోసారి విష్ణు స్పష్టం చేశాడు.
This post was last modified on June 29, 2025 10:49 am
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…