Movie News

ప్రమోషన్లు చేసే ‘మార్గం’ ఇది కాదు

నిన్న కన్నప్పతో పాటు విజయ్ ఆంటోనీ మార్గన్ విడుదలయ్యింది, ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్త డిస్ట్రిబ్యూషన్ కాబట్టి చెప్పుకోదగ్గ థియేటర్లు దొరికాయి. ఉదయం ఆటకు పెద్దగా జనాలు కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మెల్లగా మొదలైన టాక్ సాయంత్రం షోల నుంచి ప్రేక్షకులు కొంత పెరిగేలా చేసింది. కథ పరంగా రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ దర్శకుడు లియో జాన్ పాల్ ట్రీట్ మెంట్ ఈ జానర్ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ట్విస్టులు, స్క్రీన్ ప్లే, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ వగైరా అంశాలు నిరాశ పరచకుండా కాపాడాయి. గత కొన్నేళ్లలో బిచ్చగాడు హీరోకి ఇదే డీసెంట్ మూవీ.

ఇదంతా బాగానే ఉంది కానీ మార్గన్ కు ప్రమోషన్లు చేయకపోవడం శాపంగా మారుతోంది. తమిళ వెర్షన్ వరకు విజయ్ ఆంటోనీ స్వయంగా చూసుకుంటూ అక్కడి మీడియా, అభిమానులను కలుస్తూ టాక్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ తెలుగులో ఆ సపోర్ట్ కొరవడింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి చేశారు కానీ అది జనాల దృష్టికి వెళ్లకుండానే అయిపోయింది. స్ట్రెయిట్ అయినా, డబ్బింగ్ అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో పబ్లిసిటీ చాలా ముఖ్యంగా. ప్రభాస్ లాంటి కటవుట్ ఉన్నా సరే కన్నప్ప కోసం మంచు విష్ణు ఎంత కష్టపడింది కష్టపడుతోంది ఇంకా చూస్తూనే ఉన్నాం. ట్రెండ్ కు తగ్గట్టు ఈ స్పీడ్ కావాల్సిందే.

మరీ ఇంత రేంజ్ లో కాకపోయినా మార్గన్ ని ఓ మోస్తరుగా అయినా ప్రమోట్ చేస్తే తెలుగు ఆడియన్స్ ఆదరించే అవకాశాలు లేకపోలేదు. యావరేజ్ కు కొంచెం పైన ఉన్నా ఆదరణ దక్కుతున్న టాలీవుడ్ లో మార్గన్ అదే కోవలోకి వస్తుంది. బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోనీకి ఒక్క బ్లాక్ బస్టర్ లేదు. బిచ్చగాడు 2 కొంత పర్వాలేదనిపించుకుంది. మిగిలినవన్నీ దారుణంగా పోయాయి. చివరి మూడు సినిమాలు మరీ అన్యాయం. విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాదు మార్గన్ కు స్వయంగా సంగీతం కూడా సమకూర్చాడు. ఇప్పుడొచ్చిన టాక్ కొంచెం స్టాండ్ అయితే నిర్మాతకు లాభాలొస్తాయి.

This post was last modified on June 29, 2025 11:17 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

22 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago