మంచు మోహన్ బాబు ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ 2003లో ‘విష్ణు’ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు మంచు విష్ణు. కానీ అతడికి ఆశించిన ఆరంభం దక్కలేదు. తర్వాత కూడా వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. మధ్యలో ‘ఢీ’తో హిట్టు కొట్టినా.. మళ్లీ వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. కొంచెం గ్యాప్ తర్వాత దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి సినిమాలతో మంచి ఫలితాలు అందుకున్నా మళ్లీ కథ మామూలే. ఓ దశాబ్దం పాటు నిఖార్సయిన హిట్టే లేదు విష్ణుకు. వరుస ఫెయిల్యూర్ల వల్ల కావచ్చు, బయట ప్రవర్తన వల్ల కావచ్చు సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ ఎదుర్కొన్నాడు మంచు హీరో.
అతను తన సినిమాలకు సంబంధించి ఏదైనా కంటెంట్ రిలీజ్ చేసినా.. ఈవెంట్లలో ఏదైనా మాట్లాడినా.. అది ట్రోల్ మెటీరియల్ అయిపోయే పరిస్థితి. తన కలల ప్రాజెక్టు ‘కన్నప్ప’ను మొదలుపెట్టాక కూడా విష్ణు చాలా నెగెటివిటీనే ఎదుర్కొన్నాడు. ఈ సినిమా నుంచి ఫస్ట్ టీజర్ రిలీజ్ చేస్తే దానిపైనా ఎన్నో మీమ్స్, ట్రోల్స్ పడ్డాయి. దీంతో ‘కన్నప్ప’ సినిమా పరిస్థితి ఏమవుతుందో అని టీంలో ఆందోళన నెలకొంది. ఈ సినిమా రిలీజయ్యాక ట్రోల్స్ చేస్తారేమో అని ముందుగా వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి. అయినా సరే.. మంచు విష్ణు దొరికితే ఆడేసుకుందామని ఒక బ్యాచ్ రెడీగా ఉంది సోషల్ మీడియాలో. ఈ సినిమాకు డివైడ్ టాక్ రావడం.. కొన్ని సీన్లు బాలేకపోవడంతో నిన్న ఉదయం నుంచి ఆ బ్యాచ్ డ్యూటీ ఎక్కేసింది.
కానీ మంచు విష్ణు నటన మీద ట్రోల్స్, మీమ్స్ వేద్దామని ఎదురు చూస్తున్న వాళ్లకు మాత్రం అతను ఛాన్స్ ఇవ్వలేదు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో మంచు విష్ణు ఎంతో జాగ్రత్తగా నటించాడు. పాత్రకు తగ్గట్లుగా సిన్సియర్‌గా నటించాడు. విష్ణు డైలాగ్ డెలివరీ విషయంలో గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ చారిత్రక నేపథ్యంలో ఉన్న ఈ పాత్రలో మాత్రం విమర్శకులకు అతను అవకాశం ఇవ్వలేదు. తెలుగు ఉచ్ఛారణ స్పష్టంగా సాగింది.
ఇక నటన విషయంలో అయితే విష్ణు అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. తిన్నడు కన్నప్పగా మారాక భక్తి పారవశ్యంలో మునిగి తేలే సీన్లలో.. హార్డ్ హిట్టింగ్‌గా, హృద్యంగా సాగే పతాక సన్నివేశాల్లో విష్ణు గొప్పగా నటించాడు. ఇక్కడ చిన్న తేడా జరిగినా ట్రోలర్స్‌కు విష్ణు దొరికిపోయేవాడు. ఆ సన్నివేశాలు ట్రోల్ మెటీరియల్‌గా మారేవి. కానీ విష్ణు గొప్పగా నటించి మార్కులు కొట్టేశాడు. నటుడిగా తన మీద సందేహాలు వ్యక్తం చేసిన అందరికీ తన పెర్ఫామెన్సుతో అతను సమాధానం చెప్పాడు. ‘కన్నప్ప’ విషయంలో అతి పెద్ద సర్ప్రైజ్, సక్సెస్ అదే.
This post was last modified on June 28, 2025 2:57 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…