తెలుగు నుంచి కొంచెం గ్యాప్ తర్వాత రిలీజవుతున్న పాన్ ఇండియా సినిమా.. కన్నప్ప. దీన్ని తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఆయా భాషలకు చెందిన పేరున్న నటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. చారిత్రక నేపథ్యం ఉన్న, డివోషనల్ టచ్ ఉన్న సినిమాలకు హిందీలో కొన్నేళ్లుగా మంచి ఫలితాలు దక్కుతున్న నేపథ్యంలో ‘కన్నప్ప’ అక్కడ సర్ప్రైజ్ హిట్టయ్యే అవకాశాలను కొట్టి పారేయలేం. అక్కడి వాళ్లకు శివుడంటే మహా భక్తి. పైగా బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అక్షయ్ కుమార్ ఆ పాత్రను చేశాడు. కాబట్టి కథ కనెక్ట్ అయితే.. ‘కన్నప్ప’ ఉత్తరాదిన అదరగొట్టినా ఆశ్చర్యం లేదు. అక్కడి ప్రేక్షకుల అభిరుచిని, మనోభావాలను దృష్టిలో ఉంచుకుని సినిమాలో కొన్ని మార్పులు కూడా చేసినట్లు హీారో, నిర్మాత మంచు విష్ణు తెలిపాడు.
కన్నప్ప పాత్రకు సంబంధించి రెండు కీలకమైన విషయాలను హిందీ వెర్షన్లో తీసేసినట్లు మంచు విష్ణు వెల్లడించాడు. ముందు శివుడి మీద ఏమాత్రం భక్తి లేని కన్నప్ప.. ఓ సందర్భంలో శివ లింగం మీద కాలు పెడతాడు. అదే కన్నప్ప తర్వాత భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ.. శివుడికి నీటితో అభిషేకం చేయాల్సిన పరిస్థితుల్లో నీళ్లు తీసుకు రావడానికి ఏ వస్తువూ దొరక్క నోట్లో నీళ్లు తీసుకొచ్చి అలాగే అభిషేకం చేస్తాడు. ఇవి కన్నప్ప కథలో నిజంగా జరిగినవని చరిత్ర చెబుతోంది.
‘కన్నప్ప’ తెలుగు వెర్షన్లో ఈ షాట్స్ ఉంటాయి. కానీ కన్నప్ప కథ తెలియని ఉత్తరాది ప్రేక్షకులు.. ఇలాంటివి చూసి తప్పుగా అర్థం చేసుకుంటారేమో.. వీటి మీద వివాదాలు చెలరేగుతాయేమో అని సంబంధిత షాట్స్‌ను సినిమా నుంచి తీసేసినట్లు విష్ణు వెల్లడించాడు. ఐతే తెలుగు వాళ్లకు ఒరిజినల్ కథ తెలుసు కాబట్టి.. ఇవి తెలుగు వెర్షన్లో ఉంటాయని.. అంతేకాక శివలింగం మీద కన్నప్ప కాలు పెట్టే సన్నివేశానికి సంబంధించి పోస్టర్‌ను రిలీజ్ రోజు లాంచ్ చేస్తామని విష్ణు ఈ సందర్భంగా వెల్లడించాడు.
This post was last modified on June 27, 2025 12:03 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…