ఇంకొక్క ఇరవై నాలుగు గంటల కన్నా తక్కువ సమయంలోనే కన్నప్ప షోలు ప్రారంభం కాబోతున్నాయి. రెండు రోజుల ముందే బుక్ మై షో ట్రెండింగ్ లోకి రావడం అభిమానులు శుభ సూచకంగా భావిస్తున్నారు. దానికి ప్రధాన కారణం ప్రభాసేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓపెనింగ్స్ కోసం ట్రంప్ కార్డుగా డార్లింగ్ ని వాడుతున్నప్పటికీ అసలు సినిమాలో ఉన్న ఇతర అంశాలు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయని టీమ్ చెబుతోంది. ఎందుకంటే ప్రభాస్ అరగంట కనిపించినా మిగిలిన రెండున్నర గంటలు బరువును మోయాల్సింది విష్ణునే. అందులోనూ ఇంటర్వల్ తర్వాతే రుద్ర వస్తాడని మొన్న బివిఎస్ రవి స్టేజి మీదే చెప్పేశారు.
ఇది విష్ణుకి అగ్ని పరీక్ష అనడానికి కారణాలున్నాయి. ఇప్పటిదాకా లక్ష్మి ప్రసన్న బ్యానర్ లో ఏ సినిమాకు పెట్టనంత బడ్జెట్ దీనికి ఖర్చు పెట్టారు. సుదీర్ఘ అనుభవమున్న మోహన్ బాబు కంటెంట్ మీద నమ్మకంతో కొడుకు సాహసానికి ఎస్ చెప్పేశారు. అంత పెద్ద క్యాస్టింగ్ ని తీసుకెళ్లి న్యూజిలాండ్ లో షూటింగ్ చేసుకొచ్చారు. ఆఫ్ లైన్ టాక్ లో రెండు వందల కోట్ల బడ్జెట్ అయ్యిందనే టాక్ ఉంది కానీ అది ఎంత వరకు నిజమనేది విష్ణుకి మాత్రమే తెలుసు. మహాభారతం లాంటి ఎపిక్ ని హ్యాండిల్ చేసిన అనుభవమున్న ముఖేష్ కుమార్ సింగ్ ని దర్శకుడిగా ఎంచుకోవడం ద్వారా విష్ణు వేసిన ఎత్తుగడ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
గత వారం కుబేరతో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. మరీ పుష్ప 2 రేంజ్ లో రికార్డులు బద్దలు కొట్టడం లేదు కానీ దాని మీదున్న అంచనాలు మించి రెండో వారంలోకి అడుగు పెట్టకుండానే వంద కోట్ల గ్రాస్ దాటేయడం ట్రేడ్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. కన్నప్ప కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కనీసం రెండు వారాల పాటు స్ట్రాంగ్ గా ఉండటం ఖాయం. విష్ణు నటన, మోహన్ లాల్ – అక్షయ్ కుమార్ – మోహన్ బాబు లాంటి సీనియర్ల పాత్రలు అంచనాలను పెంచడానికి దోహదపడుతున్నాయి. డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కించిన విష్ణు కల ఏ రూపంలో సాకారం కానుందో రేపీపాటికి తేలనుంది. చూద్దాం.
This post was last modified on June 26, 2025 3:37 pm
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…