హిట్ 3 ది థర్డ్ కేస్ క్లైమాక్స్ లో స్పెషల్ క్యామియో ద్వారా కార్తీ ఆ సినిమాకు మంచి జోష్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పోలీస్ ఆఫీసర్ వీరప్పన్ గా కనిపించేది కొన్ని నిమిషాలే అయినా చెన్నై సూపర్ కంగ్ ఫ్యాన్ గా మెప్పించాడు. హిట్ 4 కథేంటో తెలియకుండానే కార్తీ ఒప్పుకున్నాడంటే దానికి కారణం కేవలం నాని స్నేహమే. ఇప్పుడా బాకీని నానీ తీర్చుకోబోతున్నట్టు చెన్నై టాక్. తమిజ్ దర్శకత్వంలో కార్తీ చేయబోయే ప్యాన్ ఇండియా మూవీలో కీలకమైన క్యామియో చేయడానికి నాని ఒప్పుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాథమికంగా ఓకే అనుకున్నారని అంతర్గత సమాచారం.
నాని ప్రస్తుతం ది ప్యారడై,జ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. పలు కారణాల వల్ల రెగ్యులర్ షూట్ కి చిన్న బ్రేక్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వచ్చే నెల నుంచి స్పీడ్ పెంచబోతున్నట్టు తెలిసింది. దీని తర్వాత హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ కి ఓకే చెప్పాడనే టాక్ వచ్చింది కానీ అదెంత వరకు నిజమో నిర్ధారణగా తెలియాల్సి ఉంది. ఇక కార్తీ విషయానికి వస్తే సర్దార్ 2ని వేగంగా పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఆగస్ట్ లో కూలీ రిలీజ్ కాగానే దర్శకుడు లోకేష్ కనగరాజ్ వెంటనే ఖైదీ 2 మొదలు పెడతాడు. స్క్రిప్ట్ కో నాలుగైదు నెలలు తీసుకున్నా 2026 ప్రారంభంలో స్టార్టయిపోతుంది.
ఇవి కాకుండా వా వాతియార్ రిలీజ్ కు రెడీగా ఉంది కానీ ఎందుకో విడుదల తేదీ ప్రకటించడం నిర్మాతలు తాత్సారం ప్రదర్శిస్తున్నారు. వీటి సంగతి అలా ఉంచితే నాని, కార్తీ పరస్పరం ఇంత ఫ్రెండ్ షిప్ గా ఉండటం మంచి పరిణామమే. తమిజ్ తో చేయబోయే సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. దేవర తరహాలో చాలా షాకింగ్ కంటెంట్ సిద్ధం చేసుకున్నారని ఇన్ సైడ్ టాక్. స్వతహాగా మంచి నటుడైన తమిజ్ గతంలో దర్శకత్వం వహించిన తానక్కరన్ కు చాలా ప్రశంసలు వచ్చాయి. ఓటిటి రిలీజైనప్పటికీ బ్లాక్ బస్టర్ అందుకుంది. మరి కార్తీ కోసం ఎలాంటి సబ్జెక్టు సిద్ధం చేసుకున్నాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates