కన్నప్ప విడుదలను దృష్టిలో ఉంచుకుని కన్నప్ప టీమ్ ఆన్ లైన్ ట్రోలర్స్ కు ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ఇటీవలి కాలంలో ట్రోలింగ్ పేరుతో వ్యక్తిత్వ హనన పెరిగిపోయింది. విష్ణుతో పాటు మంచు కుటుంబం దీని వల్ల చాలా ఇబ్బంది పడింది. ఫ్లాపులు అందరికీ సహజమే కానీ కావాలని ఉద్దేశపూర్వవికంగా ఎగతాళి పోస్టులు, వీడియోలు పెట్టడం ఒకదశలో శృతి మించిపోయింది. విష్ణు దీన్ని పర్సనల్ గా తీసుకుని సైబర్ క్రైమ్ లో కంప్లయింట్ ఇచ్చాక వీటి తాకిడి తగ్గింది. యూట్యూబ్ లో పిచ్చి పిచ్చి థంబ్ నైల్స్ పెట్టి మిలియన్ల వ్యూస్ తెచ్చుకునే బ్యాచులు క్రమంగా తమ జోరుని తగ్గించాయి.
ఈ నేపథ్యంలో కన్నప్పని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నందున విష్ణు లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. భావ ప్రకటన స్వేచ్ఛ పరిమితుల్లో తమ సినిమా మీద అభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళ మీద ఎలాంటి ఆంక్షలు లేవని, కానీ కావాలని బురద జల్లే ఉద్దేశంతో క్రియేటివ్ వర్క్ మీద నెగటివిటీని తీసుకొచ్చే వాళ్ళ మీద మాత్రం చట్టపరంగా చర్యలు ఉంటాయని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరఫున ఒక సుదీర్ఘమైన లెటర్ నోటీస్ ని మంచు విష్ణు విడుదల చేశాడు. అందులో పేర్కొన్న సెక్షన్లు, నిర్మాత కం నటుడిగా తనకు, మోహన్ బాబుకు వర్తించే హక్కుల గురించి అందులో స్పష్టంగా పేర్కొన్నాడు.
ఒకరకంగా చెప్పాలంటే ఇది మంచి పనే. సినిమా బాగుంటే జనం ఆదరిస్తారు. లేదంటే థియేటర్ కు రావడం మానేస్తారు. అంతే తప్ప మధ్యలో ఎవరో కావాలని రాళ్లు వేసినంత మాత్రాన మంచి కంటెంట్ కిల్ అయిపోదు. కాకపోతే సోషల్ మీడియా ప్రభావం కొన్నిసార్లు అనూహ్యంగా ఉంటుంది కాబట్టి వీలైనంత కట్టి చేయడం అవసరం. అలాని ప్రతిదాన్ని నియంత్రించలేం కానీ ఉన్నంతలో కొంత మేర నిలువరించినా సక్సెస్ అయినట్టే. ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కన్నప్పకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. మంచి ఓపెనింగ్ రావొచ్చని ట్రేడ్ ప్రాధమిక అంచనా.
This post was last modified on June 25, 2025 3:16 pm
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీ రాజధాని అమరావతి.. మరిన్ని కొత్త సొబగులు తీర్చిదిద్దుకుంటోంది. ఇప్పటికే నిర్మాణ పనులు వాయు వేగంతో ముందకు సాగుతున్నాయి. రేయింబవళ్లు…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…