ఏకంగా డజను కథలు రిజెక్ట్ చేసాడంట

రామ్‍కి గతంలో పలుమార్లు స్టార్‍గా తన రేంజ్‍ పెంచుకునే అవకాశం వచ్చినా కానీ రాంగ్‍ ప్రాజెక్టులు సెలక్ట్ చేసుకుని హిట్‍ సినిమాల అడ్వాంటేజ్‍ చెడగొట్టుకున్నాడు. అతని కెరీర్లో అలాంటి తప్పిదాలు పలుమార్లు జరిగాయి. అందుకే ఈసారి చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్‍ తర్వాత రామ్‍ చాలా సెలక్టివ్‍గా సినిమాలు చేస్తున్నాడు.

రెడ్‍ రీమేక్‍ చేయాలా వద్దా అని పలుమార్లు తర్కించుకుని ఆ చిత్రం పూర్తి చేసాడు. అది ఓటిటి ద్వారా విడుదల చేయడానికి వీల్లేదంటూ థియేటర్లు తెరిచే వరకు వేచి చూస్తానంటున్నాడు. ఆ తర్వాత ఏ సినిమా చేయాలనే దానిపై రామ్‍ ఇంకా నిర్ణయానికి రాలేదు. ప్రస్తుతం అందరు హీరోలు తిరిగి సెట్స్ మీదకు వెళ్లిపోయినా రామ్‍ మాత్రం ఇంకా తదుపరి చిత్రం ఖరారు చేసుకోలేదు.

గత రెండు నెలల్లోనే అతను పన్నెండు కథలు విని రిజెక్ట్ చేసాడని అంటున్నారు. ఎంత ఎక్సయిటింగ్‍ లైన్‍ అయినా కానీ హండ్రెడ్‍ పర్సంట్‍ కాన్ఫిడెంట్‍ అనిపించకపోతే రిజెక్ట్ చేస్తున్నాడట. తన లుక్స్ చూసి డైరెక్టర్స్ ఏమైనా ఇన్‍స్పయిర్‍ అయి కొత్త తరహా కథలు రాస్తారేమోనని తరచుగా లుక్స్ కూడా మార్చేస్తున్నాడు.