Movie News

రజిని స్టామినాకు లోకేష్ బ్రాండ్ తోడైతే

ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న కూలీ తెలుగు థియేటర్ హక్కుల వార్తలు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. ఇంకా ఎవరికీ ఫైనల్ కానప్పటికీ అగ్ర నిర్మాణ సంస్థలు నువ్వా నేనా అని తలపడుతున్న వైనం గురించి ఇండస్ట్రీలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏపీ తెలంగాణ కలిపి నలభై నుంచి యాభై కోట్ల మధ్యలో డీల్ క్లోజ్ చేసేందుకు సన్ పిక్చర్స్ ఎదురు చూస్తోంది. ఏషియన్, సితార, సురేష్, అన్నపూర్ణ ఇలా ఎవరికి వారు తమ తమ మార్గాల్లో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ వ్యవహారాలు చూసుకుంటున్న చెన్నై ప్రతినిధులు ఒత్తిడి తట్టుకోలేక ఫోన్లు కాసేపు స్విచ్ అఫ్ చేసి ఉంచారని టాక్.

ఇదిలా ఉండగా కూలికి ఇంత డిమాండ్ రావడానికి కేవలం రజనీకాంత్ ఇమేజ్ ఒకటే కారణం కాదు. ఎందుకంటే జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లాల్ సలామ్ వస్తే దానికి కనీస ఓపెనింగ్ దక్కలేదు. ప్రీ రిలీజ్ వైబ్స్ ముందే నెగటివ్ గా ఉండటంతో టాలీవుడ్ ప్రేక్షకులు దానికి దూరంగా ఉండిపోయారు. రజని మినహాయించి ఆ సినిమాకు బజ్ వచ్చే అంశం ఒక్కటంటే ఒక్కటి లేకపోయింది. కానీ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ బ్రాండ్ తోడయ్యింది. ఇతని మేనియా మన దగ్గర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలంటే లియోకు హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ లో వచ్చిన వసూళ్లు చూస్తే అర్థమైపోతుంది.

సో రజని, లోకేష్ కలిసికట్టుగా ఇంత వేల్యూ తీసుకొచ్చారన్న మాట. మ్యాటర్ ఇక్కడితో అయిపోలేదు. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ పాత్రలు అంచనాలను ఇంకాస్తా పైకి తీసుకెళుతున్నాయి. విక్రమ్ లో ఒక్క రోలెక్స్ క్యారెక్టర్ కే మాస్ వెర్రెక్కిపోయారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా మూడు ఉన్నాయంటే థియేటర్లలో పూనకాలు ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. వినడానికి ఇదంతా బాగుంది కానీ కూలి బ్రేక్ ఈవెన్ కావాలంటే వంద కోట్ల గ్రాస్ ఖచ్చితంగా రావాల్సిందే. ట్రైలర్ ఎంత బజ్ పెంచుతుందనేది కీలకం కానుంది. అనిరుద్ రవిచందర్ పాటల గురించి కోలీవుడ్ వర్గాల్లో చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వినిపిస్తోంది.

This post was last modified on June 24, 2025 8:51 pm

Share

Recent Posts

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

51 minutes ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

2 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

3 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

4 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

6 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

6 hours ago