ఎన్టీఆర్‍తో మలి చిత్రాన్ని ఖాయం చేసుకున్న త్రివిక్రమ్ అతని రాకకోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్టీఆర్ కోసమని రాసుకున్న కథకు డైలాగ్ వెర్షన్‍తో సహా త్రివిక్రమ్ లాక్ చేసేసాడట. ఎన్టీఆర్ ఎప్పుడు వస్తానని ఖచ్చితమైన సమాచారం అందిస్తే దానికి నెల రోజుల ముందు నుంచీ ప్రీ ప్రొడక్షన్ మొదలు పెడతారట. అయితే ఈలోగా పవన్ కళ్యాణ్ చేస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ చిత్రానికి త్రివిక్రమ్ మార్పులు చేసి మాటలు రాస్తాడనే ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ బ్రాండ్ తోడయితే మరింత క్రేజ్ ఏర్పడుతుందనేది మేకర్ల అభిప్రాయం కావచ్చు. ఇంకా ఈ చిత్రంలో నటించే రెండో హీరో ఎవరనే దానిపై స్పష్టమయిన సమాచారం లేదు కానీ ముందునుంచీ అనుకుంటోన్న రానా దగ్గుబాటి పేరు ఖాయం చేస్తారని వినిపిస్తోంది. త్రివిక్రమ్ మాటలు రాసినంత మాత్రాన క్రేజ్ వచ్చేస్తుందని అనుకోవడానికి లేదు. బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందేమో కానీ త్రివిక్రమ్ గతంలో పవన్ సినిమాకి మాటలు రాయగా ఆ చిత్రం అట్టర్‍ఫ్లాపయింది.
‘తీన్‍మార్’ అనుభవం తెలుసు కనుక ఈ చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు వుంటాయని వినిపిస్తోన్నా ఫాన్స్ ఎక్సయిట్ అవడం లేదు. పైగా అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమా మాటల సినిమా కాదు… ఇది ఫక్తు యాక్షన్ సినిమా కనుక త్రివిక్రమ్ మాయాజాలం చూపించడానికి వీల్లేదు.
This post was last modified on November 13, 2020 8:54 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…