ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోతున్న కన్నప్ప మంచు విష్ణుకి చాలా ప్రెస్టీజియస్ మూవీ. ప్రమోషన్ల పరంగా తన శక్తివంచన లేకుండా కష్టపడిన వైనం మీడియాలో కనిపిస్తోంది. దుబాయ్ కెళ్ళి మరీ ఈవెంట్ చేయడం ఎంత కమిట్ మెంట్ ఉందో తేటతెల్లం చేస్తోంది. హైదరాబాద్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో దీన్ని పతాక స్థాయికి తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్న విష్ణు దానికి ప్రభాస్ ని గెస్టుగా తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఎంతవరకు సఫలీకృతమవుతాడో వేడుక జరిగే రోజే తెలియనుంది. అయితే ఇప్పుడు టాపిక్ ఇది కాదు. కుబేరకొస్తున్న స్పందన కన్నప్పకు కొత్త ఉత్సహాన్ని ఇచ్చేలా ఉంది.
ఎందుకంటే గత కొన్ని వారాలుగా థియేటర్ల దగ్గర వాతావరణం చూసి బయ్యర్లు, నిర్మాతలు టెన్షన్ పడ్డారు. ప్రేక్షకులు సినిమాలు చూసే మూడ్ లో లేరని, ఇప్పట్లో మార్పు వచ్చేలా లేదని ఏవేవో విశ్లేషణలు చేసుకున్నారు. కొందరు ఏకంగా రివ్యూలే దెబ్బ కొడుతున్నాయని స్టేట్ మెంట్ ఇచ్చారు. అవన్నీ తప్పని కుబేర నిరూపించింది. రెగ్యులర్ మాస్ సినిమా కాకపోయినా జనం ఆదరిస్తున్న తీరు కళ్ళముందు కనిపిస్తోంది. ఏపీలోని ప్రధాన కేంద్రాల్లో 75 రూపాయల హైక్ ఇచ్చినా హౌస్ ఫుల్స్ పడటమే దానికి నిదర్శనం. పాజిటివ్ టాక్ వస్తే చాలు జనాలు మధ్యాన్నం షోల నుంచే పెరగడం ప్రారంభమవుతుందని ప్రూవ్ చేసింది.
జూన్ 27న కన్నప్పకు కావాల్సింది ఇలాంటి టాకే. ప్రభాస్ ఇమేజ్ ఓపెనింగ్స్ తీసుకొచ్చినా తర్వాత లాంగ్ రన్ లో నిలబెట్టాల్సింది మాత్రం మంచు విష్ణునే. అది తెలిసే తన వంతుగా ఆడియన్స్ లోకి ఎక్కువ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెలుగు ఆడియన్స్ కి సుపరిచితుడు కాదు. తన బ్రాండ్ ఉపయోగపడదు. అందుకే దాన్ని హైలైట్ చేయకుండా వీలైనంత వరకు కన్నప్పకు మంచి డివోషనల్ మూవీగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ముందు రోజు ప్రీమియర్లు వేసే ఆలోచన లేకపోయినా రిలీజ్ రోజు త్వరగా షోలు మొదలుపెట్టే ఆలోచనైతే ఉందట.
This post was last modified on June 20, 2025 9:55 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…