Movie News

కమల్ ఫెయిల్… మరి ఆమిర్?

ఓటీటీ విప్లవం వల్ల థియేటర్ల మీద ప్రతికూల ప్రభావం గట్టిగానే పడిందన్నది స్పష్టం. కొత్త చిత్రాలు థియేటర్లలో రిలీజైన కొన్ని వారాలకే ఓటీటీల్లో వచ్చేస్తుండడంతో కొన్ని రోజులు వెయిట్ చేసి ఇంట్లోనే సినిమా చూసుకుందాం అనే ధోరణి పెరిగిపోయింది. డిజిటల్ ఆదాయం కోసం ఆశపడుతూ తక్కువ గ్యాప్‌తో అక్కడ సినిమాలను రిలీజ్ చేసేయడానికి ఒప్పేసుకుంటున్న నిర్మాతలు.. థియేటర్ల వ్యవస్థను దెబ్బ తీసుకుంటున్నారని, ఇక్కడ్నుంచి వచ్చే ఆదాయాన్ని అంతకంతకూ తగ్గించేసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్, డిజిటల్ రిలీజ్‌కు మధ్య గ్యాప్ పెంచాలనే అభిప్రాయాన్ని నిర్మాతలు తరచుగా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కమల్ హాసన్ ఈ విషయంలో పట్టుదల ప్రదర్శించారు.

మిగతా తమిళ చిత్రాలకు భిన్నంగా తన ప్రొడక్షన్ సినిమా ‘థగ్ లైఫ్’కు ఎనిమిది వారాల విండో ఉండేలా ఓటీటీ సంస్థతో డీల్ చేసుకున్నారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుని వారానికే చతికిలపడడంతో ఇప్పుడు కమల్ ఆలోచన మారినట్లు తెలుస్తోంది. సినిమాను ముందుగానే ఓటీటీలోకి తీసుకురావడానికి సంప్రదింపులు జరుగుతున్నాయి. థియేటర్లను బతికించేయాలని, వెంటనే సినిమా ఓటీటీలో వచ్చేస్తుందనే ఆలోచనను మార్చాలని కమల్ ఒక ప్రయత్నం చేశారు. కానీ అది ఫెయిలైంది. ఇప్పుడిక అందరి దృష్టీ బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ వైపు మళ్లుతోంది. ఓటీటీల పట్ల విముఖతను ఎప్పట్నుంచో ఆమిర్ చూపిస్తూనే ఉన్నారు. డిజిటల్ రిలీజ్ గ్యాప్ తగ్గించుకుంటూ పోతే థియేటర్లు చచ్చిపోతాయని.. వాటిని కాపాడుకోవాలని అంటున్నారు.

ఈ క్రమంలోనే ఆయన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా థియేట్రికల్, డిజిటల్ రిలీజ్ మధ్య కొన్ని నెలల గ్యాప్ ఉండేలా చూసుకున్నారు. కానీ ఆ సినిమా బోల్తా కొట్టడంతో ఆమిర్ నిర్ణయం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు ‘సితారే జమీన్ పర్’ విషయంలో ఆమిర్ విప్లవాత్మక ఆలోచన చేశారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమ్మనే లేదు. ఎనిమిది వారాల తర్వాత యూట్యూబ్‌లో ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం రూ.120 కోట్ల డీల్‌ను ఆయన వదులుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఐతే సినిమాకు మంచి డిమాండ్ ఉన్నపుడు ఇలాంటి సాహసాలు చేసినా ఓకే కానీ.. అటు ఇటు అయితే కష్టమే. ‘సితారే జమీన్ పర్’కు ప్రి రిలీజ్ బజ్ అయితే గొప్పగా లేదు. రేపు రిలీజ్ కానున్న సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్లుగా ఉన్నాయి. థియేటర్లలో సినిమా చూడ్డానికి ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. అలాంటపుడు రేప్పొద్దున పే పర్ వ్యూ పద్ధతిలో మాత్రం సినిమాను చూస్తారా అన్నది సందేహం. థియేటర్లలో సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోతే.. ఆమిర్ రెండు రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉంది. కమల్ లాగే తర్వాత ఆలోచన మార్చుకుని కొన్ని వారాల్లోనే ఓటీటీలో సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అయినా ఆశ్చర్యం లేదు.

This post was last modified on June 19, 2025 6:01 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

49 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago