మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న పెద్దికి సంబంధించిన కీలక ఎపిసోడ్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ ఎత్తున వేసిన ట్రైన్ సెట్ లో ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇది ఇప్పటిదాకా చూడని స్థాయిలో ఉంటుందని, గతంలో ట్రైన్ బ్యాక్ డ్రాప్ లో లెక్కలేనన్ని సినిమాలు వచ్చినప్పటికీ నెవర్ బిఫోర్ తరహాలో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది ప్రారంభంలో వచ్చే చరణ్ ఇంట్రోగా వస్తుందట. హై ఇంటెన్స్ యాక్షన్ తో ఈ స్థాయి పరిచయం ఈ మధ్య ఎవరికీ జరగలేదనే స్థాయిలో ఉంటుందట.
ఫైట్ మాస్టర్ నభాకాంత్ నేతృత్వంలో ఈ మొత్తం ఎపిసోడ్ వేరే లెవెల్ లో ఉంటుందని ఊరిస్తున్నారు. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైన్ గొప్పగా ఉందని సెట్ చూసిన వాళ్ళ మాట. ఇదిలా ఉండగా అనుకున్న టైం కన్నా చాలా ముందగానే పెద్ది షూట్ అయిపోయేలా ఉంది. ఇంకా పాటల చిత్రీకరణ మొదలుపెట్టనప్పటికీ ముందు టాకీ పార్ట్ ఫినిష్ చేసి ఆపై వాటి సంగతి చూస్తారట. ఈ ఏడాది చివర్లోగా ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలనే లక్ష్యంతో చరణ్, బుచ్చిబాబు ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది మార్చి 27 విడుదల ఇంకా దూరంలో ఉన్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లకు ఎక్కువ సమయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
మైత్రి, వృద్ధి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ విలేజ్ డ్రామాలో జాన్వీ కపూర్, దివ్యెందు, శివరాజ్ కుమార్, జగపతిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం పట్ల కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ అవి టీజర్ తో తగ్గాయి. ఫైనల్ అవుట్ ఫుట్ కి కూడా ఇంతే బ్రహ్మాండంగా ఇవ్వాలని ఫాన్స్ కోరుతున్నారు. క్వాలిటీ విషయంలో బుచ్చిబాబు రాజీ పడటం లేదు. మేకింగ్ స్టిల్స్ తో పాటు చిన్న చిన్న వీడియోలు వదులుతూ అభిమానులకు మంచి కిక్ ఇస్తున్నాడు. దీని తర్వాత రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో తెరకెక్కబోయే ఆర్సి 17 తాలూకు స్క్రిప్ట్ వర్క్ త్వరలోనే కొలిక్కి రావొచ్చని వినికిడి.
Gulte Telugu Telugu Political and Movie News Updates