లైగర్, డబుల్ ఇస్మార్ట్ రూపంలో వరస డిజాస్టర్లు అందుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్ ఈసారి తన కంబ్యాక్ కోసం మాములు స్కెచ్ వేయడం లేదు. విజయ్ సేతుపతితో సినిమా ఓకే అయ్యాక క్యాస్టింగ్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు సూపర్ అనిపిస్తున్నాయి. సాధారణంగా పెద్ద ఫ్లాపులు వచ్చినప్పుడు ఎంత స్టార్ డైరెక్టర్ అయినా సరే కాంబోలు సెట్ చేసుకోవడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ పూరి ఆ సమస్య లేకుండా అన్ని మార్కెట్లను రీచ్ అయ్యేలా తారాగణం ఎంచుకుంటున్నాడు. చాలా సెలెక్టివ్ గా ఉండే సీనియర్ నటి టబుని ఓకే చేయించాడు. వీరసింహారెడ్డి విలన్ దునియా విజయ్ ని ఒప్పించాడు.
తాజాగా సంయుక్త మీనన్ ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇవాళ అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. నిజానికి ఈ పాత్రకు ముందు నివేదా థామస్, రాధికా ఆప్టే పేర్లు వినిపించాయి. పలు వర్గాలు విశ్వసనీయంగా ఇవే ఉంటాయని కూడా చెప్పాయి. కానీ తీరా చూస్తే పూరి ప్లాన్ వేరే లెవెల్ లో ఉంది. సంయుక్త మీనన్ ని తీసుకోవడం ద్వారా మంచి గ్లామర్ టచ్ ఇచ్చినట్టు అవుతుంది. తనేమి భీకరమైన ఫామ్ లో లేకపోయినా కెరీర్ లో మంచి హిట్లే ఉన్నాయి. స్వయంభు, అఖండ 2, హైందవ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ లో నటిస్తోంది. ఇలాంటి టైంలో పూరికి ఎస్ చెప్పడం చూస్తే క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉన్నట్టే.
ముందు బెగ్గర్ టైటిల్ ప్రచారంలోకి వచ్చినా ఫైనల్ గా భిక్షామ్ దేహిని లాక్ చేస్తారని లేటెస్ట్ అప్డేట్. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ అన్ని భాషలకు కనెక్ట్ అయ్యే పదం కనక దీనికే లాకవ్వొచ్చని అంటున్నారు. బెగ్గర్ లో లైగర్ తరహా సౌండింగ్ ఉండటంతో సన్నిహితులు వద్దని వారించారట. ఇటీవలే విజయేంద్ర ప్రసాద్ ని కలిసి పలు సూచనలు తీసుకుని పూరి ఏ విషయంలో రాజీ పడటం లేదు. సాంకేతిక వర్గం, ఇతర నటీనటులను త్వరలోనే ప్రకటించబోతున్నారు. తెలుగు తమిళ భాషల్లో సమాంతరంగా విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ సినిమా వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లొచ్చని తెలిసింది.
This post was last modified on June 17, 2025 11:06 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…