Movie News

కింగ్ డమ్ చుట్టూ అనుమానపు మేఘాలు

మార్చ్ నుంచి జూలై దాకా వాయిదాలు వేసుకుంటూ వచ్చిన విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కొత్త రిలీజ్ డేట్ ఇప్పటిదాకా ప్రకటించలేదు. హరిహర వీరమల్లు కోసం వెయిట్ చేస్తోందని, దాని అనౌన్స్ మెంట్ వచ్చాక నిర్ణయం తీసుకోవాలని సితార టీమ్ ప్లాన్ చేసినట్టుగా వినిపిస్తోంది. కానీ ఈ ప్రాజెక్టు మీద జరుగుతున్న ప్రచారాలు అనుమానపు మేఘాలను కమ్మేలా చేస్తున్నాయి. ఒకవేళ వీరమల్లు కనక జూలై 18 వచ్చే పక్షంలో కింగ్ డమ్ ని జూలై 25 విడుదల చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందట. కానీ ఆ డెడ్ లైన్ మీట్ కావడం గురించి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నుంచి ఎలాంటి హామీ రాలేదని ఇన్ సైడ్ టాక్.

కొంత భాగం రీ షూట్ తో పాటు అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఎక్కువ టైం పట్టేలా ఉందని వినికిడి. ప్రస్తుతం కూలితో బిజీగా ఉన్నందున కొంచెం ఆగమని చెబుతున్నాడట. ఇది నిజమైన పక్షంలో జూలైలో రావడం అనుమానమే. పోనీ ఆగస్ట్ 1 లాక్ చేసుకుందామంటే కేవలం రెండు వారాల వ్యవధిలో వార్ 2, కూలి వస్తాయి కాబట్టి థియేటర్ రన్ దెబ్బ తింటుందనే డౌట్ నిర్మాతల్లో ఉండొచ్చు. ఇంకోవైపు రానా నిర్మాతగా దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా రూపొందిన కాంతని ఆగస్ట్ 1 రిలీజ్ చేయడానికి దాదాపు డిసైడ్ అయ్యారట. అదే జరిగితే కింగ్ డమ్ కు ఇంకో ఆప్షన్ చేజారినట్టే.

జూనియర్ ఎన్టీఆర్ తో వాయిస్ ఓవర్ చెప్పించిన తర్వాత కింగ్ డమ్ కు మంచి బజ్ వచ్చింది. విజువల్స్ చూశాక కెజిఎఫ్ రేంజ్ లో ఏదో కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నామనే హామీ అందులో దొరికింది. కానీ ఈలోగా వాయిదాలు జరగడం బజ్ ని తగ్గిస్తోంది. ఇప్పటికే దీని మీద చాలా పెద్ద బడ్జెట్ పెట్టేశారు. ఆడియన్స్ లో ఎగ్జైట్ మెంట్ తగ్గకుండా ఏదో ఒక పబ్లిసిటీ జరుగుతూనే ఉండాలి. అసలే కింగ్ డమ్ శ్రీలంక శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సీరియస్ డ్రామా. మన ప్రేక్షకులను ముందస్తుగానే సిద్ధం చేయాలి. దానికున్న ఒకే ఆయుధం ప్రమోషన్లు. మరి కింగ్ డమ్ బృందం ఏ దిశగా అడుగులు వేస్తుందో చూడాలి.

This post was last modified on June 17, 2025 5:38 am

Share

Recent Posts

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

16 minutes ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

1 hour ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

3 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

3 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

4 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

6 hours ago