నిన్న విడుదలైన కన్నప్ప ట్రైలర్ కు రెస్పాన్స్ బాగుంది. కానీ ఇంకా ఎక్కువ ఆశించిన అభిమానులు మరో వెర్షన్ ని డిమాండ్ చేస్తున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ప్రభాస్ ఉన్న సీన్లను బాగానే చూపించారు కానీ డార్క్ టోన్ లో సెట్ చేసిన విఎఫ్ఎక్స్ పట్ల కొంత మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అంతే కాదు వీడియో మొదట్లో బాల కన్నప్పగా నటించిన మంచు విష్ణు అబ్బాయి అవ్రమ్ ఇంగ్లీష్ స్లాంగ్ లో డైలాగులు చెప్పడం స్పష్టంగా వినిపించింది. ఆర్టిస్టులందరినీ రివీల్ చేయడం వర్కవుట్ అయ్యింది. ముఖ్యంగా ట్రోలింగ్ కి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఎడిట్ చేయడం అన్నిటికన్నా పెద్ద సానుకూలాంశం.
ఇప్పుడు కన్నప్ప బృందంపై ఇంకో బాధ్యత ఉంది. అంచనాలను మరింత పెంచేలా కొత్త వెర్షన్ ట్రైలర్ చిన్నదైనా సరే మరొకటి రెడీ చేయాలి. రిలీజ్ ట్రైలర్ వేరే రావొచ్చని మంచు విష్ణు చూచాయగా చెప్పాడు కానీ ఎంత వరకు నిజమో ఇంకో వారంలో తెలిసిపోతుంది. గత నెల రోజులుగా స్తబ్దుగా ఉన్న థియేటర్లకు జీవం పోయాల్సిన బాధ్యత కుబేరతో పాటు కన్నప్ప మీద ఉంది. సరైన ఫీడింగ్ లేక దాదాపు బంద్ వాతావరణాన్ని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాల సినిమా హాళ్లు వీటి కోసమే ఎదురు చూస్తున్నాయి. హరిహర వీరమల్లు వాయిదా లేకపోయి ఉంటే ఇవాళ పరిస్థితి వేరుగా ఉండేది. పోస్ట్ పోన్ వల్ల అంతా రివర్స్ అయ్యింది.
ప్రమోషన్ల వరకు విష్ణు ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. ట్రైలర్ లాంచ్ కి కేరళని ఎంచుకోవడం మంచి ఎత్తుగడ. మోహన్ లాల్ ని గెస్టుగా తేవడం, సరదాగా ఈవెంట్ గడిచిపోవడం అక్కడి మీడియాలో బజ్ వచ్చేలా చేసింది. లాలెట్టాన్ ఇందులో చేసింది చిన్న పాత్రే అయినా స్వయంగా ఆయన డిస్ట్రిబ్యూట్ చేయడం చూస్తే కంటెంట్ లో విషయం ఉందని అర్థమవుతోంది. ముంబైలో అక్షయ్ కుమార్ దగ్గరుండి మరీ అన్ని చూసుకున్నాడు. గుంటూరులో ఒక ఈవెంట్ అయిపోయింది. హైదరాబాద్ ది ప్లానింగ్ ఉంది కానీ ప్రభాస్ ని గెస్టుగా తీసుకొచ్చి గ్రాండ్ గా చేస్తే కన్నప్పకు సంబంధించిన పబ్లిసిటీకి మంచి ఫినిషింగ్ టచ్ అవుతుంది.
This post was last modified on June 15, 2025 7:14 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…