టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీస్ లో ఒకటిగా ఉన్న కన్నప్ప ఈ నెలాఖరు జూన్ 27 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో మంచు విష్ణు నిర్మించిన ఈ డివోషనల్ డ్రామాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు లాంటి భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కిన కన్నప్పలో ప్రభాస్ క్యామియో చేయడం వల్ల అంచనాలు ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ట్రైలర్ మీద ఉంది. బిజినెస్, ఓపెనింగ్స్ తేవడంలో దీని పాత్ర చాలా కీలకం కావడంతో ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2 నిమిషాల 54 సెకండ్ల ట్రైలర్ లాంచ్ జరిగిపోయింది.
చిన్నప్పటి నుంచే తిన్నడు (మంచు విష్ణు) పరమ నాస్తికుడు. గూడెం అంతా శివభక్తిలో ఉంటే తాను మాత్రం దేవుడిని తిడుతూ ఉంటాడు. అక్కడ ఉండే మహిమ గల వాయు లింగం మీద శత్రువులు కన్నేస్తారు. కారణజన్ముడైన తిన్నడిలో మార్పు తెచ్చేందుకు సాక్ష్యాత్తు పరమశివుడు (అక్షయ్ కుమార్) తన బంటైన రుద్ర (ప్రభాస్) ని ఆ గూడెంకు పంపిస్తాడు. ఇద్దరి మధ్య స్నేహంతో పాటు మాటా మాటా పెరుగుతాయి. ఎన్నో అనూహ్య పరిణామాల తర్వాత తిన్నడు కన్నప్పగా మారి శివ భక్తిలోని గొప్పదనం తెలుసుకుంటాడు. అది ఎలా, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడమే అపరభక్తుడైన కన్నప్ప కథ.
అందరూ విపరీతమైన దృష్టి పెట్టిన ప్రభాస్ ని హైలైట్ చేయడం కన్నప్పకు అది పెద్ద ప్లస్ కానుంది. మాస్ కటవుట్ గానే కాక ఆధ్యాత్మికత నిండిన పాత్రల్లోనూ డార్లింగ్ ఎంతగా ఒదిగిపోగలడో ఇందులో శాంపిల్ చూపించారు. పెర్ఫార్మన్స్ పరంగా పెద్ద ఛాలెంజ్ తీసుకున్న మంచు విష్ణు దానికి తగ్గట్టే చాలా వేరియేషన్స్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. విజువల్స్ బాగున్నాయి. విఎఫ్ఎక్స్ క్వాలిటీ మీద తీసుకున్న శ్రద్ధ మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది. టెక్నికల్ టీమ్ పనితనం బాగుంది. ఇప్పటిదాకా అండర్ కవర్ గా ఉన్న కన్నప్ప అంచనాలు పెంచడంలో సక్సెసయ్యింది. అసలు కంటెంట్ ఇలాగే ఉంటే విష్ణుకి బ్లాక్ బస్టర్ ఖాయం.
This post was last modified on June 14, 2025 6:56 pm
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…
కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…
బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…