కమల్ హాసన్ కన్నడ భాష గురించి చేసిన కామెంట్లకు నిరసనగా కర్ణాటక ఫిలిం ఛాంబర్ థగ్ లైఫ్ ని బ్యాన్ చేయడంలో విజయం సాధించింది. నిరసనలకు భయపడి ఏ డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాకపోవడంతో కమల్ ఆ రాష్ట్రంలో విడుదల మానుకున్నారు. బెంగళూరు కోర్టు సైతం లోకనాయకుడికి ప్రతికూలంగా క్షమాపణ చెప్పమని సూచన చేయడం, ఆయన తప్పు చేయలేదని ప్రకటించడం తర్వాత జరిగిన పరిణామాలు. ఇప్పుడు థగ్ లైఫ్ రెండో వారంలో అడిగి పెట్టింది. దారుణమైన డిజాస్టర్ నమోదు చేసుకుని ఇండియన్ 2నే నయమనిపించే స్థాయిలో నష్టాలు తీసుకొచ్చింది. ఇక్కడితో కథ అయిపోలేదు.
ఈ వ్యవహారం మీద మహేష్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు వెళ్లారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసుని జూన్ 17కి వాయిదా వేసింది. పిటీషనర్ అడిగిన ప్రశ్నలు, ప్రస్తావించిన సెక్షన్లు సమంజసంగానే ఉన్నాయి. ఒకవేళ తుది తీర్పు కమల్ కు అనుకూలంగా వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పటికే చేతులు కాలిపోయాయి. ఇప్పుడు ఆకులు ఇచ్చి ప్రయోజనం లేదు. ఎందుకంటే థగ్ లైఫ్ రిపోర్టులు, రివ్యూలు చూసిన కన్నడ జనాలు హమ్మయ్య మేం సేఫ్ అనుకున్నారు. ఇంత లేట్ గా ఒకవేళ థియేటర్లలో రిలీజ్ చేసినా ఎలాంటి ఫలితం దక్కదు. రిలీజ్ ఖర్చులు, పోస్టర్ల వ్యయం కూడా వసూలు చేయదు.
కాకపోతే ఇంత విచిత్ర పరిణామంలోనూ ఒక మంచి ఆశించవచ్చు. అదేంటంటే ఒక వ్యక్తి వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని సినిమా విడుదల చేయనివ్వమని బెదిరించే పరిస్థితులు భవిష్యత్తులో వస్తే థగ్ లైఫ్ కేసు ఒక రిఫరెన్స్ గా ఉంటుంది. లేదూ జడ్జ్ మెంట్ కమల్ కు వ్యతిరేకంగా వస్తే మిగిలిన వాళ్ళు ఎక్కడైనా పబ్లిక్ స్టేజి మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. తమిళం నుంచే కన్నడ పుట్టిందనే కమల్ హాసన్ రేపిన మంటలు ఇప్పటికైతే చల్లరాయి కానీ ఫ్యూచర్ లో ఆయన కొత్త సినిమాల మీద ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి థగ్ లైఫ్ రేపిన గాయాలు మాత్రం అన్నీఇన్నీ కావు.
This post was last modified on June 14, 2025 10:52 am
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…