Movie News

కొత్త సినిమాలు చప్పగా…రీ రిలీజులు చూడగా

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇంకో బ్యాడ్ ఫ్రైడే వచ్చేసింది. మాములుగా థియేటర్ల దగ్గర జనంతో సందడిగా కనిపించాల్సిన వాతావరణం అసలు గేట్లైనా తెరుస్తారో లేదోని అనుమాన పడేలా చాలా సెంటర్లలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ విడుదలవుతున్న కొత్త సినిమాలు కట్టప్ప జడ్జ్ మెంట్, హంటర్, పాపా దేనికీ కనీస స్థాయిలో బజ్ లేదు. ఈ మూడు తమిళ డబ్బింగ్ బాపతే. ఏదో నాలుగు డబ్బులు వస్తాయని నిర్మాతలు ట్రై చేస్తున్నారు. పాపా గత ఏడాది ఆల్రెడీ ఒకసారి రిలీజ్ ట్రై చేసి విఫలమయ్యింది. నిజం అని ఇంకో స్ట్రెయిట్ మూవీ ఉంది కానీ దాంట్లో క్యాస్టింగ్ ఎవరో కూడా ప్రేక్షకులకు అవగాహన లేదు.

వీటి సంగతి ఇలా ఉండగా ఈసారి కూడా రీ రిలీజుల సందడే ఎక్కువ కనిపిస్తోంది. అనూహ్యంగా అందాల రాక్షసి బుకింగ్స్ చాలా బాగున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎక్కువ శాతం షోలు అడ్వాన్స్ లోనే ఫుల్ అవుతున్నాయి. నోటెడ్ హీరోలు లేకపోయినా సరే రధన్ పాటలు, ప్రేమని కొత్త ఎమోషన్ తో చూపించిన హను రాఘవపూడి దర్శకత్వం యూత్ ని లాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ మళ్ళీ వస్తున్నా ఫ్యాన్స్ ఆసక్తిగానే ఉన్నారు. హరిహర వీరమల్లు వాయిదా పడిన గాయాన్ని మర్చిపోవడానికి దీన్నో మార్గంగా ఎంచుకుంటున్నారు. రవితేజ వెంకీ సైతం మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

సో ఇంకో వారం రోజులు ఎగ్జిబిటర్లు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. జూన్ 20 కుబేర రిలీజ్ అయ్యే దాకా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. థియేటర్ల బంద్ ఎవరూ చేయకపోయినా సరైన సినిమాలు ఇవ్వకపోవడంతో ఇండస్ట్రీనే ఒక రకంగా ఇన్ డైరెక్ట్ బంద్ చేయించినట్టు అయ్యింది. షోలు వేయడానికి థియేటర్లు సిద్ధంగా ఉన్నా, సిబ్బంది ఎదురు చూస్తున్నా అసలు జనం వచ్చేలా చేయడానికి ఏ సినిమా లేకపోవడమే ఇలాంటి దుస్థితికి కారణం. కుబేర తర్వాత వారానికి కన్నప్ప వస్తుంది కాబట్టి వీటికి కనక హిట్ టాక్ వస్తే మళ్ళీ థియేటర్లోలో ఆడియన్స్ నిండుగా ఉన్న సీన్లను చూడొచ్చు.

This post was last modified on June 13, 2025 12:21 pm

Share

Recent Posts

ఏమీ పట్టనట్టు వుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…

14 minutes ago

విజయదశమి క్లాష్… ‘పంచతంత్ర’ పోటీ

ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…

39 minutes ago

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

11 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

12 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

12 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

12 hours ago