Movie News

నా ఫొటో అలా ఎందుకు వేస్తున్నారు – దివి

ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుక‌ల్లో గంజాయి, అనుమ‌తి లేని విదేశీ మ‌ద్యం దొర‌క‌డం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ శివార్ల‌లోని ఒక రిసార్ట్‌లో మంగ‌ళ‌వారం రాత్రి ఈ వేడుక‌లు జ‌ర‌గ్గా.. ప‌క్కా స‌మాచారంతో అక్క‌డ దాడి చేసిన పోలీసులు గంజాయి, విదేశీ మ‌ద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ పార్టీలో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన కొంద‌రు ప్ర‌ముఖులు కూడా పాల్గొన్నట్లు వెల్ల‌డైంది. పార్టీకి వ‌చ్చిన వారిలో కొంద‌రు గంజాయి తీసుకున్న‌ట్లు ప‌రీక్ష‌ల్లో తేలిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి.

ఐతే మీడియాలో ఈ వార్త గురించి రిపోర్ట్ చేస్తూ త‌న పేరు, ఫొటోల‌ను త‌ప్పుగా చూపిస్తున్నారంటూ న‌టి దివి ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఆధారాలు లేకుండా ఇలా త‌న గురించి నెగెటివ్ న్యూస్ వేస్తే త‌న కెరీర్‌కు ఎంత ఇబ్బంది అవుతుందో చెబుతూ ఆమె ఒక ఆడియో నోట్ రిలీజ్ చేసింది.

”మీడియా మిత్రుల‌కు ఒక చిన్న విన్న‌పం. ఇప్పుడు ఫ్రెండ్ బ‌ర్త్ డే పార్టీ అని వెళ్తే అక్క‌డ ఏం జ‌రుగుతుందో.. వాళ్ల‌కు సంబంధించిన త‌ప్పులు అన్నీ తొయ్య‌డం క‌రెక్ట్ కాదు క‌దండీ. మీరు కూడా ఒక‌సారి చూడండి. అక్క‌డ మ‌నం కూడా ఏమైనా త‌ప్పులు చేశాం అని ఆధారాలు ఉంటే నా ఫొటో వేస్తే బాగుంటుంది. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా నా ఫొటో వాడి నెగెటివ్ న్యూస్ రాస్తే నా కెరీర్‌కు ఎంత ఇబ్బంది అండీ.

ఎంత క‌ష్ట‌ప‌డి ఇక్క‌డిదాకా వ‌చ్చాను. మీరు కూడా మీ ఫ్రెండ్ బ‌ర్త్ డే అంటే వెళ్తారు. అక్క‌డ ఏమైనా జ‌రిగితే మీది బాధ్య‌త కాదు క‌దా. మంగ్లీ కూడా మంచి పేరున్న వ్య‌క్తి. నాకు స్నేహితురాలు కావ‌డంతో పార్టీకి వెళ్లా అక్క‌డ జ‌రిగిన దానికి నేను బాధ్యురాలి లాగా నా ఫొటో పెట్టి ఇలా చేయ‌డం చాలా త‌ప్పండీ. ద‌య‌చేసి దీన్ని దృష్టిలో ఉంచుకోవాల‌ని కోరుతున్నా” అని దివి పేర్కొంది. పార్టీకి హాజ‌రైన వారిలో దివితో పాటు లిరిసిస్ట్ కాస‌ర్ల శ్యామ్, క‌మెడియ‌న్ ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

This post was last modified on June 11, 2025 6:18 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

2 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

2 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

2 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

3 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

4 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

4 hours ago