అత్యవసరంగా ఒక బ్లాక్ బస్టర్ అవసరమైన టైంలో తమ్ముడుగా వస్తున్నాడు నితిన్. తనకిష్టమైన పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ టైటిల్ ని వాడుకోవడంతో పాటు దిల్ రాజు నిర్మాణం, వేణు శ్రీరామ్ మీద నమ్మకంతో ఈసారి ఖచ్చితంగా హిట్టు కొడతాననే ధీమాతో ఉన్నాడు. కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా చాలా గ్యాప్ తర్వాత సీనియర్ నటి లయ దీంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. రెండు మూడు వాయిదాలు పడినా కంటెంట్ మీద నమ్మకంతో ఎస్విసి సంస్థ దీన్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిగింది. కథేంటో దాచకుండా రెండున్నర నిమిషాల వీడియోలో రివీల్ చేశారు.
ఎక్కడో ప్రపంచానికి పెద్దగా సంబంధాలు లేని ఒక కొండ ప్రాంతం. వెళ్లి వచ్చేందుకు ఒకే దారి ఉంటుంది. అక్కడి గిరిజనులకు ఆడవే ఆధారం. అయితే కొందరు దుర్మార్గుల స్వార్థం వల్ల అక్కడ దారుణాలు, మరణాలు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే వాళ్లకు అండగా ఉండేందుకు వెళ్లిన ఒక మహిళా అధికారి (లయ) తన జీవితంలోనే అతి పెద్ద ప్రమాదాన్ని తెచ్చుకుంటుంది. అనూహ్య కారణంతో ఆమెకు దూరమైన తమ్ముడు (నితిన్) అక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం అక్కడ అడుగు పెడతాడు. మేనకోడలు ప్రాణాలు కాపాడేందుకు పూనుకుంటాడు. అదేంటో తెలియాలంటే జూలై 4 థియేటర్లకు వెళ్లాల్సిందే.
విజువల్స్ చూస్తుంటే తమ్ముడు ఎంత భారీ బడ్జెట్ తో రూపొందిందో అర్థమవుతుంది. అక్క సెంటిమెంట్ మెయిన్ హైలైట్ గా చెబుతున్నప్పటికీ యాక్షన్ బ్లాక్స్ భారీ ఎత్తున షూట్ చేశారు వేణు శ్రీరామ్. మాస్ కి అప్పీలయ్యే ఎపిసోడ్స్ పుష్కలంగా పెట్టేశారు. లైన్ పరంగా మరీ కొత్తగా కాదు కానీ ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్న హామీ అయితే దక్కింది. కెవి గుహన్ ఛాయాగ్రహణం, అజనీష్ లోకనాధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, దిల్ రాజు – శిరీష్ నిర్మాణ విలువలు ఒకదాంతో మరొకటి పోటీ పడ్డాయి. పాటలు, టీజర్ కాకుండా నేరుగా ట్రైలర్ తో వచ్చిన తమ్ముడు అంచనాలైతే పెంచేలానే కనిపించాడు.
This post was last modified on June 11, 2025 5:26 pm
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…