Movie News

తారక్ టు బన్నీ.. బన్నీ టు తారక్

‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తాడనే అంతా అనుకున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్లు.. అలవైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంబినేషన్లో ఈసారి పాన్ ఇండియా స్థాయిలో భారీ చిత్రం తీయడానికి కొన్నేళ్ల ముందే సన్నాహాలు మొదలయ్యాయి. దీని గురించి నిర్మాతలు బన్నీ వాసు, నాగవంశీ ఎప్పటికప్పుడు ఊరిస్తూనే వచ్చారు.
తీరా చూస్తే బన్నీ త్రివిక్రమ్ సినిమాను కాకుండా.. అట్లీ చిత్రాన్ని టేకప్ చేసి పెద్ద షాకిచ్చాడు. అయినా సరే అట్లీ మూవీ తర్వాత త్రివిక్రమ్ చిత్రం ఉంటుందని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.

ఆ కథను బన్నీతో కాకుడా జూనియర్ ఎన్టీఆర్‌తో చేయడానికి త్రివిక్రమ్ రెడీ అయిపోయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ను పూర్తి చేశాక తారక్.. మాటల మాంత్రికుడితో ఈ భారీ చిత్రం కోసం జట్టు కడతాడని వార్తలు వస్తున్నాయి. ఈలోపు త్రివిక్రమ్ వేరే సినిమా చేసుకుని రెడీగా ఉంటాడు. బన్నీ చేయాల్సిన సినిమా స్థానంలోకి తారక్ చిత్రం రావడం ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు కొరటాల శివ సైతం బన్నీతో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. కానీ తర్వాత దాని స్థానంలోకి తారక్ సినిమా వచ్చింది. అదే దేవర.

నిజానికి ఈ చిత్రాన్ని నిర్మించిన తన మిత్రుడు మిక్కిలినేని సుధాకర్‌ను ముందు కొరటాల ప్రొడ్యూసర్‌గా పరిచయం చేయాలనుకున్నది తారక్‌ మూవీతోనే. కానీ అది సాధ్యపడక బన్నీతో సినిమాను అనౌన్స్ చేశాడు కొరటాల. కానీ తర్వాత మళ్లీ కథ మలుపు తిరిగి ‘దేవర’ చేశాడు.

ఇక ‘అల వైకుంఠపురములో’ తర్వాత త్రివిక్రమ్.. తారక్‌తో ‘అయిననా పోయి రావలె హస్తినకు’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ అది కుదరలేదు. ‘గుంటూరు కారం’ తీశాడు. తర్వాత బన్నీ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ అది ఇప్పుడు పక్కకు వెళ్లిపోయి తారక్‌తో అదే కథను తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తారక్- బన్నీ మధ్య కథలు చేతులు మారడం.. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి తారకే ఆయా దర్శకులతో జట్టు కడుతుండడం విశేషం.

This post was last modified on June 11, 2025 1:11 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

6 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

6 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

7 hours ago