అసలింకా అధికారిక ప్రకటనలు రాకముందే త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే సినిమాల వార్తలు ఫిలిం నగర్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ముందు వెంకటేష్ తో అన్నారు. దీని లాంచ్ వచ్చే నెల ఉండొచ్చనే లీక్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇదింకా లైన్ లో ఉండగానే రామ్ చరణ్ తో ప్రాజెక్టుకు అడుగులు వేగంగా పడుతున్నాయనే లీక్ మెగా ఫ్యాన్స్ ని యాక్టివ్ చేసింది. పెద్ది తర్వాత ఆర్సి 17ని సుకుమార్ కనక ఆలస్యం చేసే పక్షంలో త్రివిక్రమ్ తో వేగంగా మూవీ చేసేందుకు చరణ్ అంగీకారం తెలిపినట్టుగా వచ్చిన వార్త గంటల తరబడి ట్రెండింగ్లో ఉంది. ఈలోగానే కొత్త ట్విస్టు వచ్చింది.
అల్లు అర్జున్ తో అనుకున్న ఫాంటసీ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నాడనేది లేటెస్ట్ అప్డేట్. అయితే ఇప్పటికిప్పుడు ఇదేం ప్రారంభం కాదు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సినిమా అయ్యాక దేవర 2 ఉంది. దాని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఒక మూవీ ఉండొచ్చనే క్లూలు సితార సంస్థ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంది. మధ్యలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ప్రచారం బయటికి వచ్చింది. ఇవన్నీ జరిగే లోపు రెండు మూడు సంవత్సరాలు గడిచిపోతాయి. 2027 కల్లా త్రివిక్రమ్ వెంకటేష్, రామ్ చరణ్ సినిమాలు పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చేస్తారు.
ఇప్పటికైతే ప్లానింగ్ ఇలా కనిపిస్తోంది కానీ ఎంతవరకు నిజమవుతుందో సమాధానం చెప్పాల్సింది కాలమే. జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయికలో గతంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ ఘనవిజయం అందుకోవడమే కాక తారక్ లోని కొత్త ఫ్యాక్షన్ యాంగిల్ ని బయటికి తీసుకొచ్చింది. ఇప్పుడు బన్నీ ప్రాజెక్టు తనే చేసే పక్షంలో జూనియర్ కెరీర్ లోనే అతి పెద్ద ఫాంటసీ ప్రాజెక్ట్ అవుతుంది. కుమారస్వామి అంశను బ్యాక్ డ్రాప్ గా తీసుకుని డివోషనల్ ఎలిమెంట్స్ తో త్రివిక్రమ్ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తారని లీకుల సారాంశం. గతంలో నాగవంశీ మా ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి స్టాండర్డ్ ని మించిపోయేలా త్రివిక్రమ్ ఈ సబ్జెక్ రాసుకున్నారని చెప్పడం ఫ్యాన్స్ అంచనాలు పెంచేస్తోంది.
This post was last modified on June 11, 2025 10:02 am
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్కు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి…
రిలీజ్ ముందు బజ్ లేకుండా, విడుదలైన రోజు కొందరు క్రిటిక్స్ దారుణంగా విమర్శించిన దురంధర్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని…