Movie News

నిలువెత్తునా ముంచేసిన థగ్ లైఫ్

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ ఫిలిమ్స్‌లో ఒకటిగా పేరు తెచ్చుకున్న చిత్రం.. ‘నాయకన్’. టైమ్ సంస్థ ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప చిత్రాలంటూ వంద సినిమాాలను ప్రకటిస్తే.. అందులో ఇండియా నుంచి చోటు దక్కించుకున్న మూవీ ‘నాయకన్’. ఇలాంటి సినిమాను అందించిన కమల్ హాసన్-మణిరత్నం కలయికలో ఓ సినిమా వస్తుంటే అభిమానుల ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు. పైగా ఇది ‘నాయకన్’ను మించిన సినిమా అంటూ కమల్ పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు. 

ట్రైలర్ చూస్తే ‘నాయకన్’ను మించకపోయినా.. డీసెంట్ మూవీనే అయ్యుంటుందని ఆశించారు ప్రేక్షకులు. కానీ తీరా థియేటర్లకు వెళ్లిన వాళ్లకు దిమ్మదిరిగి బొమ్మ కనిపించింది. మణిరత్నం కెరీర్లోనే అత్యంత పేలవమైన సినిమాల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. మార్నింగ్ షో నుంచే డిజాస్టర్ టాక్‌తో మొదలైన ఈ సినిమా.. ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. కొందరు తమిళ క్రిటిక్స్, అక్కడి ప్రేక్షకులు తొలి రోజు దీనికి కూడా హైప్ ఇచ్చుకున్నారు. కానీ అక్కడ కూడా సినిమా నిలబడలేదు.

తెలుగులో ఒక్క షో పూర్తి కాగానే ‘థగ్ లైఫ్’ పెద్ద డిజాస్టర్ అని తేలిపోయింది. రిలీజ్‌కు ముందు ఉన్న అంచనాల కారణంగా తొలి రోజు రూ.కోటి షేర్ రాబట్టింది ‘థగ్ లైఫ్’. తర్వాత నాలుగు రోజులు కలిపినా షేర్ కోటిని మించలేదు. సోమవారానికే థియేటర్లు ఖాళీ అయిపోయాయి. జనం లేక షోలు క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితి. ఇక థియేటర్ల నుంచి వచ్చే ఆదాయమేమీ లేనట్లే. రూ.18 కోట్లకు సినిమాను కొన్న నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి.. రూ.2 కోట్ల ఆదాయంతో సరిపెట్టుకుంటున్నారు. 

ఒక డబ్బింగ్ మూవీ మీద రూ.16 కోట్ల నష్టం అంటే ఎంత పెద్ద దెబ్బో అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు  కమల్ మూవీ ‘విక్రమ్’తో సంపాదించిన దాని మీద కొన్ని రెట్లు ఇప్పుడు నష్టపోతున్నారాయన. ఇక తమిళనాడు, ఇతర ప్రాంతాల్లో కూడా ‘థగ్ లైఫ్’ బయ్యర్లను నిలువునా ముంచేసింది. రూ.250 కోట్లకు పైగా బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. అందులో నాలుగో వంతును మించి థియేటర్ల నుంచి రాబట్టేలా లేదు. తమిళనాడులో సినిమా ఓ మోస్తరుగా నడుస్తోంది. మిగతా చోట్ల ఆల్రెడీ వాషౌట్ అయిపోయింది. ‘నాయకన్’ కాంబో అని ఎంతో ఎగ్జైట్ అయితే.. మళ్లీ ఈ జోడీ ఎందుకు కలిసిందా అని అందరూ తలలు పట్టుకునే పరిస్థితి తలెత్తింది.

This post was last modified on June 10, 2025 3:56 pm

Share

Recent Posts

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…

6 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

26 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

58 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago