Movie News

డిజాస్టర్ దెబ్బ…థగ్ లైఫ్ బేరాలు

విడుదలకు ముందు కమల్ హాసన్ చాలా కాన్ఫిడెంట్ గా సినిమా అద్భుతంగా ఉందని, అందుకే నెట్ ఫ్లిక్స్ తో మాట్లాడి ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పించామని మహా గొప్పగా చెప్పుకున్నారు. ఈ కారణంగానే హిందీ మల్టీప్లెక్సుల్లో షోలు పడ్డాయి. తీరా చూస్తే బొమ్మ అల్ట్రా డిజాస్టర్ అయ్యింది. ఈ దశాబ్దంలో వచ్చిన అతి పెద్ద ఫ్లాప్స్ గా చెప్పుకుంటున్న ఇండియన్ 2, కంగువాని దాటిపోయేలా వసూళ్లను నమోదు చేస్తోంది. సక్సెస్ అయితే విజయ యాత్రలు ప్లాన్ చేసుకున్న కమల్ బృందానికి ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. కనీసం ప్రెస్ మీట్ పెట్టి మాటవరసకైనా ఆడియన్స్ కి థాంక్స్ చెప్పే ప్రయత్నం చేయలేదు.

సరే ఇప్పుడు ఫలితం తేలిపోయింది కాబట్టి థగ్ లైఫ్ బృందం నెట్ ఫ్లిక్స్ తో తిరిగి బేరాలు మొదలుపెట్టిందని చెన్నై టాక్. ఎనిమిది వారాలకు బదులు నెలకే స్ట్రీమింగ్ అయితే అదనపు మొత్తం వచ్చేలా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అయితే రెవిన్యూ, పబ్లిక్ టాక్స్, రివ్యూస్ అన్నీ గమనిస్తున్న నెట్ ఫ్లిక్స్ అంత మొత్తం ఇవ్వకపోవచ్చని అంటున్నారు. కాకపోతే ముందు ఒప్పుకున్న దానికన్నా ఎక్కువే దక్కొచ్చు. ఎందుకంటే ఇలాంటి డిజాస్టర్లు థియేటర్లలో ఆడకపోయినా ఓటిటిలో భారీ వ్యూస్ తెచ్చుకుంటాయి. కంగువా, విడాముయార్చి, రెట్రో లాంటివి దీన్ని ఋజువు చేశాయి.

అందుకే థగ్ లైఫ్ కూడా అదే దారిలో వెళ్లాలనే ఆలోచనలో ఉందట. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఊరికే ఇలాంటి గాసిప్పులు రావుగా. మణిరత్నం కెరీర్ లోనే అత్యంత బ్యాడ్ మూవీగా విమర్శకులు తలంటిన థగ్ లైఫ్ రెండో వారంలోకి అడుగు పెట్టకుండానే ఫైనల్ రన్ కు వచ్చేలా ఉంది. హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల మల్టీప్లెక్సుల్లో కొద్దిగా జనం కనిపిస్తున్నప్పటికీ బిసి సెంటర్స్ లో మాత్రం చాలా చోట్ల వాషౌట్ అయిపోయింది. షోలు క్యాన్సిలవుతున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. ఏది ఏమైనా కమల్ హాసన్ ఇప్పట్లో మర్చిపోలేని పీడకలగా థగ్ లైఫ్ నిలుస్తోంది. కోట్లు ఖర్చు పెట్టిన ప్రమోషన్లు వృథా అయ్యాయి.

This post was last modified on June 10, 2025 4:53 am

Share

Recent Posts

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

20 minutes ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

24 minutes ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

1 hour ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

4 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

4 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

5 hours ago