Movie News

కుబేర బడ్జెట్… అంతా?

తెలుగులో రాబోతున్న పెద్ద సినిమాల్లో ఒకటి.. ‘కుబేర’. సమ్మర్లో బాక్సాఫీస్ వెలవెలబోయాక ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ నెల 20న ‘కుబేర’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం మీద నిర్మాత సునీల్ నారంగ్ చాలా పెద్ద పెట్టుబడే పెట్టేశారట. ఆ మొత్తం రూ.150 కోట్లు కావడం గమనార్హం. వాస్తవానికి రూ.90 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తీయాలని ప్రణాళిక వేసుకున్నారట. కానీ మేకింగ్ కొంత ఆలస్యం కావడంతో బడ్జెట్ రూ.120 కోట్లకు చేరిందట. వడ్డీల భారం కూడా తోడై బడ్జెట్ రూ.150 కోట్లకు చేరినట్లు సునీల్ నారంగ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

ఈ సినిమా డిజిటల్ హక్కులను రూ.47 కోట్లకు అమ్మినట్లు ఆయన తెలిపారు. అంటే ‘కుబేర’ తెలుగు, తమిళ భాషల్లో కలిపి రూ.100 కోట్లకు పైగానే షేర్ రాబట్టాల్సి ఉందన్నమాట. ధనుష్ తమిళంలో మిడ్ రేంజ్ స్టార్. తెలుగులోనూ కొంచెం ఫాలోయింగ్ ఉంది. ఇక టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఇందులో ముఖ్య పాత్ర పోషించాడు. గత కొన్నేళ్లలో నాగ్ మార్కెట్ కొంచెం దెబ్బ తిన్న మాట వాస్తవం. పైగా ‘కుబేర’లో ఆయనది లీడ్ రోల్ కాదు. మరి ధనుష్, నాగ్‌ల స్టార్ పవర్ ఈ సినిమాకు ఎంతమేర ఓపెనింగ్స్ తెచ్చిపెడుతుంది.. రూ.100 కోట్ల టార్గెట్‌ను ఎలా అందుకుంటుంది అన్నది ఆసక్తికరం. 

సినిమా ఆలస్యం కావడం వల్ల, ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోకపోవడం వల్ల ‘కుబేర’కు ఆశించిన హైప్ క్రియేట్ కాలేదు. ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇంకా రెండు సాంగ్స్ ఇవ్వాల్సి ఉందని సునీల్ నారంగ్ చెప్పడం విశేషం. మరి ఆ పాటలు సినిమాలో ఉంటాయా లేదా అన్నది ప్రశ్నార్థకం. ఇప్పుడు పాటలిస్తే ఇక వాటి చిత్రీకరణ ఎప్పుడు జరపాలి? రిలీజ్ వచ్చే నెలలో చేద్దాం అనుకున్నా ఓటీటీ సంస్థ ఒప్పుకోలేదని.. అలా అయితే రేటు తగ్గిస్తామని చెప్పడంతో ఈ నెల 20కే ఫిక్సయ్యామని నారంగ్ అంటున్నారు. ఈ హడావుడి వల్లే సినిమా ప్రమోషన్లు సరిగా జరగట్లేదని తెలుస్తోంది. రిలీజ్ టైంకి రావాల్సిన హైప్ వచ్చేస్తుందా? సినిమా ఆశించిన ఓపెనింగ్స్ రాబడుతుందా? చూడాలి మరి.

This post was last modified on June 9, 2025 2:55 pm

Share

Recent Posts

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

1 hour ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

3 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

5 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

7 hours ago