కరోనా విరామం తర్వాత టాలీవుడ్ స్టార్లలో అందరి కంటే లేటుగా షూటింగ్‌కు సిద్ధమైంది మెగాస్టార్ చిరంజీవే. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోపే మళ్లీ షూటింగ్‌లు మొదలుపెట్టడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల పెద్దల్ని కలిసిన చిరు.. మిగతా హీరోలంతా రంగంలోకి దిగాక కూడా పని మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
ఎట్టకేలకు ఈ సోమవారం ‘ఆచార్య’ చిత్రీకరణ పున:ప్రారంభించడం కోసం ఆయన ప్రణాళికలు రచించుకున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ తీరా చూస్తే చిరంజీవి కరోనా బారిన పడ్డారన్న వార్త బయటికి వచ్చింది. ‘ఆచార్య’ కోసమనే కరోనా టెస్టు చేయించుకుంటే ఆయనకు పాజిటివ్ వచ్చింది. పెద్దగా లక్షణాలు లేకపోవడంతో చిరు హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఐతే చిరు అందబాటులో లేకపోయినా ‘ఆచార్య’ షూటింగ్ మాత్రం ఆగకపోవడం విశేషం.
అనుకున్న ప్రకారమే సోమవారం ‘ఆచార్య’ చిత్రీకరణ పున:ప్రారంభించారు. చిరు నుంచి సమాచారం అందగానే ప్రొడక్షన్ టీం ప్రణాళికలు మార్చుకుంది. ఆయన లేని సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేసుకుంది. ఈ మేరకు ఆర్టిస్టుల డేట్లు సర్దుబాటు చేసుకున్నారు. చిరు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం పడకపోవచ్చని.. ఆయన రెండు వారాల్లో కోలుకుని షూటింగ్‌కు వస్తారని ఆశిస్తోంది చిత్ర బృందం. ఈలోపు ఆయన లేని సన్నివేశాలన్నీ పూర్తి చేస్తారు.
చిరు వచ్చే సమయానికి అందరి డేట్లు సర్దుబాటు చేసి పక్కా ప్లాన్‌తో రెడీగా ఉంటారు. ఆయన రాగానే ఆ సన్నివేశాల చిత్రీకరణ సాగుతుంది. ఏదేమైనప్పటికీ వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేసి తీరాలన్న పట్టుదలతో చిత్ర బృందం ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ నటించనున్న ఈ చిత్రానికి మణిరత్నం సంగీతాన్నందిస్తున్నాడు.
This post was last modified on November 10, 2020 3:11 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…