ఇవాళ విడుదలైన హౌస్ ఫుల్ 5 కి రెండు క్లైమాక్స్ లు పెట్టి రెండు వెర్షన్లు ఒకే రోజు విడుదల చేయడం గురించి నిర్మాతలు మహా గొప్పగా చెప్పుకున్నారు. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, నానా పాటేకర్ లాంటి స్టార్ క్యాస్టింగ్ తో నవ్వులతో ముంచెత్తుతామని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఇలా డబుల్ ఎండింగ్స్ ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేదంటూ ఢంకాలు బజాయించుకున్నారు. తీరా చూస్తే రివ్యూలు, పబ్లిక్ టాక్స్ హౌస్ ఫుల్ 5ని తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్నాయి. బూతులు, అర్థం లేని జోకులు, ఓవర్ ఎక్స్ పోజింగ్, అడల్ట్ డైలాగులతో నాసిరకం చెత్త సినిమా ఇచ్చారంటూ విమర్శకులు ఓ రేంజ్ లో తలంటుతున్నారు.
ఒక ఖరీదయిన క్రూజ్ లో జరిగే క్రైమ్ చుట్టూ అల్లుకున్న కథని నిర్మాత కం రచయిత సాజిద్ నడియాడ్ వాలా ఈ కళాఖండం బాధ్యతలను తరుణ్ మన్సుఖాని చేతిలో పెట్టారు. యుకెకి చెందిన ఒక ధనవంతుడి నూరో పుట్టినరోజు వేడుకల్లో దారుణమైన హత్య జరుగుతుంది. ముసుగు వేసుకొచ్చి మర్డర్ చేసిన ఆ కిల్లర్ కోసం బ్రిటిష్, ఇండియా పోలీసులు సంయుక్తంగా వెతుకుతారు. ఈ క్రమంలో జరిగే కామెడీలు, ట్విస్టులే హౌస్ ఫుల్ 5. హంతకుడికి సంబంధించిన చిన్న ట్విస్టు తప్ప రెండు వెర్షన్లలో పెద్దగా మార్పులు కనిపించవు. ఏది చూసినా తేడా కొట్టదు. పచ్చిగా చెప్పాలంటే పళ్ళు ఊడగొట్టుకోవడానికి ఏ రాయైతేనేం సామెతలాగా.
ఏదో అద్భుతం చేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ ఎదురు చూసిన హౌస్ ఫుల్ 5కి ఎంత మేరకు ఆదరణ దక్కుతుందో వీకెండయ్యాక తేలుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తిరస్కారం ఖాయమే కానీ హిందీ ఆడియన్స్ పల్స్ ని ఒక్కోసారి అంచనా వేయలేం. ఇలాంటి చీప్ కామెడీలు కమర్షియల్ గా వర్కౌట్ అయిన దాఖలాలు ఉన్నాయి. హౌస్ ఫుల్ సిరీస్ వీరాభిమానులు సైతం తీవ్రంగా బాధపడే రేంజ్ లో దీన్ని తీర్చిదిద్దిన తీరుకి వెయ్యి నమస్కారాలు పెట్టినా తప్పు లేదు. అవుట్ డేటెడ్ నెరేషన్ తో ఒకపక్క థగ్ లైఫ్ బుర్రలు తినేయగా ఇంకోవైపు హౌస్ ఫుల్ 5 వెనక్కు చూడకుండా పారిపోయేలా చేసింది. ఇక్కడితో ఈ ఫ్రాంచైజ్ కి బ్రేక్ వేస్తారో లేదో.
This post was last modified on June 6, 2025 7:55 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…