సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబోలో తెరకెక్కిన కూలి థియేటర్ హక్కుల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఒక్క ఓవర్సీస్ కోసమే 80 కోట్ల పైగా ఆఫర్ వచ్చినట్టు ట్రేడ్ టాక్. ఇది నిజమైతే కొత్త రికార్డు నమోదైనట్టే. ఇంకా లాక్ చేయలేదు కానీ ఇంకేమైనా డీల్స్ వస్తాయేమోనని నిర్మాత ఎదురు చూస్తున్నట్టు చెన్నై రిపోర్ట్. తెలుగు రైట్స్ కోసం మూడు అగ్ర నిర్మాణ సంస్థలు 50 నుంచి 60 కోట్ల దాకా ఆఫర్ చేసినట్టు ఇన్ సైడ్ లీక్. కానీ సన్ పిక్చర్స్ ఇంకో పది ఇరవై ఎక్కువ కోరుకుంటున్నట్టు తెలిసింది. ఇదంతా కేవలం రెండు చిన్న టీజర్లకొచ్చిన స్పందన వల్ల జరుగుతున్న భీభత్సం.
పోటీలో జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 లాంటి మరో మల్టీస్టారర్ ఉన్నప్పటికీ కూలి మీద బజ్ అంతకంతా పెరుగుతోంది. రజనితో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ ల కాంబినేషన్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తోంది. ఇతర భాషల్లోనే ఇలా ఉంటే ఇక తమిళం గురించి వేరే చెప్పాలా. తమిళనాడు వెర్షన్ ని ఎంత లేదన్నా రెండు వందల కోట్లకు క్లోజ్ చేయొచ్చని అంటున్నారు. నాన్ థియేటర్, డిజిటల్, డబ్బింగ్, ఓటిటి, ఆడియో ఇతరత్రా హక్కులన్నీ కలుపుకుంటే సన్ పిక్చర్స్ పంట మాములుగా పండేలా లేదు. అనిరుద్ రవిచందర్ సంగీతం హైప్ ని రెట్టింపు కన్నా ఎక్కువ స్థాయిలో పెంచేస్తోంది.
ఏపీ తెలంగాణ హక్కులు అన్నపూర్ణ స్టూడియోస్ దక్కించుకున్నట్టు వచ్చిన వార్త ఇంకా ధృవీకరణ కాలేదు. నాగార్జున అడిగారు కానీ ప్రొడక్షన్ కంపెనీ డిమాండ్ చేసిన మొత్తానికి ఈయన కోట్ చేసిన దానికి వ్యత్యాసం ఉండటం వల్లే కొంచెం పెండింగ్ ఉందని అంటున్నారు. అయితే కూలిలో ప్రత్యేక పాత్ర చేసిన కారణంగా నాగ్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తే ఆశ్చర్యం లేదు. ఇంకో రెండు నెలలు ఉండగానే కూలి ఈ స్థాయిలో సంచలనాలు నమోదు చేయడం చూస్తే రిలీజ్ దగ్గరయ్యే కొద్దీ మూవీ లవర్స్ ఫీవర్ అమాంతం పెరిగేలా ఉంది. వచ్చే నెల చెన్నై, ఆగస్ట్ మొదటి వారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారట.
This post was last modified on June 3, 2025 10:59 am
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…