‘‘బుమ్రా, బౌల్ట్ వేసిన యార్కర్లను అయ్యర్ థర్డ్ మ్యాన్ బౌండరీకి తరలించిన తీరు అత్యద్భుతం….ఢిల్లీని ఫైనల్ తీసుకువెళ్లిన అయ్యర్, ఆ తర్వాత కోల్ కతాకు కప్ అందించాడు..అయినా ఆ తర్వాత టీమ్ నుంచి డ్రాప్ చేశారు…పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంజాబ్ ను ఫైనల్ కు చేర్చాడు…’’అంటూ టాలీవుడ్ కు చెందిన ప్రముఖుడు ఒకరు ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే, ఈ పోస్ట్ ను హీరో వెంకటేష్ లా రెగ్యులర్ గా క్రికెట్ మ్యాచ్ లు, ఐపీఎల్ ఫాలో అయ్యే వారు పెట్టి ఉంటారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. మహేష్ బాబు సినిమా షూటింగుతో బిజీగా ఉన్న టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఇంత తీరిగ్గా మ్యాచ్ చూసి విశ్లేషించిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
ముంబై ఇండియన్స్ తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ తో తన జట్టును ఫైనల్ కు చేర్చిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ ను చూసిన జక్కన్న అయ్యర్ ను ఆకాశానికెత్తేశాడు. అయితే, అయ్యర్ ను డ్రాప్ చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్-2025 ఫైనల్ మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కింగ్ కోహ్లీపై కూడా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు జక్కన్న.
ప్రతి ఏటా ఐపీఎల్ లో పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ ఈ ఏడాది కూడా అదరగొట్టాడని కితాబిచ్చాడు రాజమౌళి. ఈ ఏడాది కప్ కొట్టేందుకు కోహ్లీ కూడా అర్హుడే అని చెప్పాడు. ఈ ఇద్దరిలో ఎవరు ట్రోఫీని లిఫ్ట్ చేసినా హార్ట్ బ్రేకింగ్ తప్పదని అన్నాడు. దీంతో, రాజమౌళి పోస్ట్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
ఇంత బిజీ షెడ్యూల్ లో ఐపీఎల్ మ్యాచ్ చూడడమే కాకుండా విశ్లేషించే టైమెక్కడిది సామీ అంటూ ఒక యూజర్ కామెంట్ చేశాడు. షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది? మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అప్డేట్ ఇస్తామన్నారు..దాని సంగతి చూడకుండా ఈ మ్యాచ్ లేంటి అంటూ మరొక నెటిజన్ ఫన్నీగా క్వచ్చన్ చేశాడు.
This post was last modified on June 2, 2025 3:24 pm
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్…
ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా నుంచి ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలంటే దానికి ఎంత హడావుడి చేస్తారో? అప్డేట్…
సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…