టాలీవుడ్ బాక్సాఫీస్ కు జూన్ నెల కీలకం కానుంది. గత రెండు నెలలుగా చాలా థియేటర్లు కనీస నిర్వహణ ఖర్చులకు సరిపడా కలెక్షన్లు రాక లబోదిబోమంటున్నాయి. ఈ కారణంగానే పర్సెంటెజ్ డిమాండ్ తెరముందుకొచ్చి నానా రగడ జరిగి బంద్ వివాదం గురించి ఎవరెవరో మాట్లాడేలా చేసింది. ఈ నేపథ్యంలో వారానికి ఒకటి చొప్పున క్రేజీ సియమాలు క్యూ కట్టడం వాళ్ళను ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది. జూన్ 5 విడుదలవుతున్న ‘థగ్ లైఫ్’ డబ్బింగ్ అయినప్పటికీ కమల్ హాసన్, శింబు, త్రిష కాంబినేషన్ తో పాటు మణిరత్నం బ్రాండ్ తెలుగులోనూ క్రేజ్ వచ్చేలా చేస్తోంది. విక్రమ్ రేంజ్ టాక్ వస్తే కనక కలెక్షన్ల మోతే.
జూన్ 12 అసలైన బిగ్ డే. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు పార్ట్ 1’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఏపీ డిప్యూటీ సిఎం అయ్యాక వస్తున్న మొదటి పవర్ స్టార్ మూవీ. బజ్ సంగతి ఎలా ఉన్నా వెల్కమ్ గ్రాండ్ గా ఉండబోతోంది. నిర్మాత ఏఎం రత్నం చూపిస్తున్న కాన్ఫిడెన్స్ కనక నిజమయ్యే పక్షంలో బాహుబలి, పుష్ప రేంజ్ రికార్డులు ఆశించవచ్చు. ఓపెనింగ్స్ ఎంత భారీగా వచ్చినా అవి నిలవాలంటే మాత్రం టాక్ చాలా ముఖ్యం. జూన్ 20 ‘కుబేర’ మీద క్రమంగా హైప్ పెరుగుతోంది. ధనుష్, నాగార్జునల తొలి కలయికకి శేఖర్ కమ్ముల తోడవ్వడం ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ని తిప్పుకునేలా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో ఆకర్షణ.
ఇక జూన్ 27 చివరి వారంలో మంచు విష్ణు ‘కన్నప్ప’తో వచ్చేస్తాడు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ క్యామియోలు బయట మార్కెట్లలో బిజినెస్ పరంగా బాగా హెల్పవుతాయని విష్ణు భావిస్తున్నాడు. కంటెంట్ మీద నమ్మకంతో ఓటిటి డీల్ ఆలస్యమవుతున్నా సరే తొందరపడటం లేదు. చాలా పెద్ద కాన్వాస్ కావడంతో పాటు హిట్ టాక్ వస్తే చాలు నార్త్ లోనూ దీన్ని బాగా రిసీవ్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక్క జూన్ నెలలోనే వస్తున్న ఈ నాలుగు సినిమాలన్నీ కలుపుకుంటే సుమారు 200 కోట్లకు పైగానే థియేటర్ బిజినెస్ కనిపిస్తోంది. ఇవన్నీ జనాలకు కనెక్ట్ అయిపోయి క్లిక్ అయితే కనక వర్షమే.
This post was last modified on June 2, 2025 10:48 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…