నిన్న చెన్నైలో జరిగిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ ప్రసంగం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మాములుగా చాలా సామ్యంగా మాట్లాడే ఇతన్ని అభిమానులైనా సరే కోపంతో ఉన్నప్పుడు చూసిన సందర్భాలు చాలా తక్కువ. ప్రశాంతమైన వదనంతో ఎప్పుడు నవ్వుతూ ఉండటమే ధనుష్ స్టైల్. కానీ దానికి భిన్నంగా నిన్న బలమైన సెటైర్లతో విరుచుకుపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ఏ వేడుకలోనూ ఈ విలక్షణ నటుడు ఇంతగా ఫైర్ కావడం చూడలేదని ఫ్యాన్స్ అంటున్నారు. కేకలు పెట్టకపోయినా సెటిల్డ్ టోన్ లో ధనుష్ అన్న మాటలు సినిమాటిక్ ఎలివేషన్ ని మించిన ఫీలింగ్ ఇచ్చాయి..
ఇంతకీ ధనుష్ ఏమన్నాడో చూద్దాం. “నాపై మీరు ఎంత నెగటివ్ ప్రచారమైనా చేసుకోండి. నా సినిమాలు రిలీజ్ ఉన్న ప్రతిసారి నెల రెండు నెలల ముందు ఏదో ఒక వివాదం సృష్టించి నాపై బురద జల్లాలని చూస్తున్నారు. కానీ అవేవి పనిచేయవు. 23 సంవత్సరాలుగా అభిమానులు నా వెన్నంటే ఉన్నారు. నన్ను అడ్డుకోవాలనుకోవడం మీ మూర్ఖత్వం. అలాంటి సర్కస్ లు చేయాలనే ఆలోచన ఉంటే పక్కకెళ్లి ఆడుకోండి. మంచి భోజనం చేస్తే చాలు సంతోషంగా అనిపించే మనస్తత్వం నాది. తప్పుడు మాటలతో నన్నేం చేయలేరు. ఫ్యాన్సే కాదు ప్రేక్షకులూ నా వెంట ఉన్నారు. అందరూ ఆనందంగా ఉందాం”. ఇదండీ సారాంశం.
ధనుష్ ఎవరిని ఉద్దేశించి అన్నాడో పేర్లను ప్రస్తావించలేదు కానీ ఆ మధ్య నయనతార వివాదం కోర్ట్ దాకా వెళ్ళినప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఏవేవో కథనాలు అల్లారు. రాయన్, కెప్టెన్ మిల్లర్ టైంలో కావాలని కొందరు నెగటివ్ పబ్లిసిటీ చేయడం గురించి ఫ్యాన్స్ ధనుష్ దృష్టికి నేరుగా తీసుకెళ్లారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకేసారి అందరికీ వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యిందని వాళ్ళు భావిస్తున్నారు. మొత్తానికి స్టేజి మీద ఎప్పుడూ సాఫ్ట్ అండ్ స్మూత్ గా కనిపించే ధనుష్ ఎట్టకేలకు తనలో మరోవైపుని పబ్లిక్ గా పరిచయం చేశాడు.
This post was last modified on June 2, 2025 10:29 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…