కన్నడలో సీనియర్ మోస్ట్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కు జైలర్ తర్వాత తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వచ్చింది. రామ్ చరణ్ పెద్దిలో చేయడానికి కారణం అదే. ఇటీవలే థగ్ లైఫ్ ఈవెంట్ లో కన్నడ భాష గురించి కమల్ హాసన్ అన్న మాటలు క్రమంగా శివన్నకు తలనెప్పిగా మారాయి. కొందరు యాంటీ ఫ్యాన్స్ తమిళం నుంచి కన్నడ పుట్టిందనే కమల్ మాటలకు ఈయన క్లాప్స్ కొట్టాడనే రీతిలో వీడియోలు వైరల్ చేయడంతో సోషల్ మీడియాలో శివన్నను టార్గెట్ చేయడం మొదలయ్యింది. దీంతో బయట ఎక్కడికి వెళ్లినా మీడియా దీని గురించే నొక్కి నొక్కి అడుగుతూ ఉండటంతో సంయమనంగా ఉండటం కష్టమైపోయింది.
తాజాగా ఒక ఈవెంట్ బయట శివరాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను అన్ని భాషలను ప్రేమిస్తానని, కానీ మాతృభాషగా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ కన్నడనేనని, ఆ రోజు కమల్ హాసన్ తన ప్రసంగంలో ఒక బాబాయ్ గా తన మీద అభిమానం చూపించడాన్ని స్వీకరిస్తూ చప్పట్లు కొట్టాను తప్పించి కన్నడ గురించి కాదని క్లారిటీ ఇచ్చాడు. ఎవరైనా కావాలని తన మీద బురద జల్లీ ప్రయత్నం చేసినా ప్రజలకు తానేంటో తెలుసని, క్షమాపణ చెప్పించే బాధ్యత తనది ఎలా అవుతుందని ప్రశ్నించాడు. చాలా సౌమ్యుడిగా పేరున్న శివరాజ్ కుమార్ కు ఇప్పుడీ వ్యవహారమంతా పెద్ద తలనెప్పిగా మారింది.
థగ్ లైఫ్ విడుదల ఇంకో నాలుగు రోజుల్లోనే ఉండటంతో ఈ వివాదం పరిష్కారం అవుతుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ వెర్షన్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఈ రోజు నుంచి మొదలయ్యాయి. బుక్ మై షోలో కర్ణాటక టికెట్లు మాత్రం పెట్టలేదు. దీన్ని బట్టే ఫిలిం ఛాంబర్ చాలా సీరియస్ గా ఉందనేది అర్థమైపోతోంది. సమస్య ఇంత తీవ్రంగా ఉందని కమల్ కు అర్థమయ్యిందో లేదోనని అభిమానులు ఖంగారు పడుతున్నారు. సారీ చెబితే కోట్ల రూపాయల ఓపెనింగ్స్, థియేటర్ రన్ దక్కుతాయి. లేదు నా పట్టుదల నాదే అంటే మాత్రం రాజ్ కమల్ బ్యానర్ రెవిన్యూలో కోత పడ్డట్టే.
This post was last modified on June 1, 2025 5:33 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…